ఎందుకు మంచివారు శ్రమలు అనుభవిస్తారు

మనం సహజంగా అడగని ప్రశ్నను అడగడానికి సి.ఎస్. లెవైస్ మనలను ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు వాక్యధ్యానం ఉదాహరణలు, వాక్యభాగాలతో మనకు ప్రోత్సాహాన్నిస్తుంది!


ఎందుకు భక్తిపరులు, దీనులు, విశ్వాసలైనవారు శ్రమలు అనుభవిస్తారు అనేది అసలైన సమస్య కాదు గాని అసలు ఎందుకు కొందరు శ్రమలు అనుభవించరు అనేదే అసలైన ప్రశ్న - సి. ఎస్. లెవైస్, బాధ యొక్క సమస్య.


1. అపనింద ఒక వ్యక్తి యొక్క జీవన ప్రగతిని నాశనం చేసింది.


2. పాస్టర్కి తీవ్రమైన అనారోగ్య సమస్య ఉంది.


3. నిజాయితీపరుని జీవితాన్ని ఒక నిజాయితీ లేని వ్యక్తి నాశనం చేశాడు.


4. విశ్వాసులు వారికున్న విశ్వాసం వలన హింసింపబడ్డారు, చంపబడ్డారు.


"నాకే ఎందుకు?" ఎపుడైనా కష్టం గుండా వెళ్తే మనకు సహజంగా వచ్చేది ఈ ప్రస్నే.


కాని "నేనెందుకు కాదు?" అనే ప్రశ్న నిజంగా తగిన ప్రశ్న.


ఈ భూమిపై మన జీవితాలు న్యాయంగా, సులభంగా ఉంటాయనే భావనను బైబిల్ పూర్తిగా ఖండిస్తుంది:


1. ఆపనింద యోసేపు జీవిత ప్రగతిని నాశనం చేసి, చెరసాలకు నడిపించింది (ఆదికాండము 39:1-10).


2. యవ్వన పాస్టర్ తిమోతికి కడుపులో తీవ్రమైన అనారోగ్య సమస్యలు (1 తిమోతి 5:23).


3. అవినీతిపరుడైన రాజు సౌలు, దావీదును చంపడానికి మరలా మరలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు (1 సమూయేలు 24:1-12).


4. విశ్వాసులు ఎప్పుడూ హింసింపబడుతూనే ఉన్నారు (హెబ్రీ 11).


ఈ భూమిపై మనకు న్యాయం దొరుకుతుందని, జీవితం సులభంగా ఉంటుందని దేవుడు ఎప్పుడూ వాగ్దానం చేయలేదు గాని ఆయన ఆదరణ ఇస్తానని మాత్రం వాగ్దానం చేశారు (2 కొరింధీ 1:3-5), అంతే కాదు మనం గనుక ఆయన ప్రణాళికలపై దృష్టి నిలిపితే, మనకు జరిగే కీడును మన మేలుకై ఉపయోగిస్తారని కూడా వాగ్దానం చేశారు (రోమా 8:28).


Why Good People Suffer


మనం సహజంగా అడగని ప్రశ్నను అడగడానికి సి.ఎస్. లెవైస్ మనలను ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు వాక్యధ్యానం ఉదాహరణలు, వాక్యభాగాలతో మనకు ప్రోత్సాహాన్నిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.