నా భర్త బూట్ క్యాంప్ లో ఉన్నప్పుడు నా కోసం వ్రాసిన అమూల్యమైన ఉత్తరాల మూట నా దగ్గర ఉంది.
తన వధువును ఎంతో మిస్ అవుతూ, ఆమెను ముఖాముఖిగా చూడాలని ఆతృతపడేవారు ఆయన.
విచారం ఏమిటంటే, దాని తరువాత ఆయన కాని నేను కాని చేత్తో ఉత్తరాలు వ్రాసి చాలా సంవత్సరాలు అయింది. గ్రీటింగ్ కార్డ్స్ లో వ్రాసే కొన్ని మాటలు పెద్దగా లెక్కలోకి రావు.
ఈ ఉత్తరాలు వ్రాయడం ఒక అంతరించిపోయిన కళగా చాలా త్వరగా మారిపోయింది, అలాంటప్పుడు ఈ పాత ప్రేమలేఖలు మరింత అమూల్యమైనవి కదా.
కాని నా భర్త వ్రాసిన వాటికంటే ఇంకా అమూల్యమైన ప్రేమలేఖలు నా దగ్గర ఉన్నాయి. నా సృష్టి కర్త, ప్రభువు, రక్షకుడు నుండి నా దగ్గర ప్రేమలేఖలు ఉన్నాయి. అవి అన్నీ కలిపి మూట కట్టి ఉన్నాయి. అవి ప్రేమ, ద్రోహం, త్యాగం, క్షమాపణ, సమాకూర్పు గురించిన కథలు చెబుతాయి.
తన వధువును* మిస్ అవుతూ, ఆమెను ముఖాముఖిగా చూడాలని ఆత్రుతపడే ప్రియుని లోతైన ప్రేమను అవి వెల్లడి చేస్తాయి (ప్రకటన 19:7-9; 1 కొరింధీయులకు 13:12). అంతే కాదు 'ఎప్పటికీ తరిగిపోని ఆనందమే' ఈ ప్రేమకధ ముగింపు.
నువ్వు కూడా ఈ అమూల్యమైన ప్రేమలేఖను పొందిన వ్యక్తివి గనుక, వాటిని చదవడానికి ఈరోజు మనం కొంత సమయం తీసుకొని, ఆయన ద్వారా ఎంతగా ప్రేమను పొందామో గుర్తుచేసుకుందాం.
* సంఘమే "క్రీస్తు యొక్క వధువు"
Old Love Letters - 1 Corinthians 13


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.