యూనివర్సిటీ స్టడీ ప్రకారం 92% ప్రజలు న్యూ ఇయర్ తీర్మానాలలో నిలబడలేరు.
ఈ స్టడీ లో తేలిన కారణాలు:
• మరీ ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోవడం
• అవి నిర్థిష్టమైన లక్ష్యాలుగా లేకపోవడం
• జవాబుదారీతనం లేకపోవడం
• విజయం సాధిస్తాం అనే నమ్మకం లేకపోవడం
అయితే ప్రతీ క్రైస్తవునికి ఉండాల్సిన ఒక ముఖ్యమైన న్యూ ఇయర్ తీర్మానం ఏమిటంటే: దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడం. ఈ సంవత్సరంలో ఈ తీర్మానంలో ఓడిపోకుండా, దీనిని సాధించాలి అంటే ఈ క్రిందివి చేద్దాం.
• వాస్తవికంగా ఉండు: నీకు రోజూ దేవునితో గడపడానికి ఒక సమయం పెట్టుకొనే అలవాటు లేకపోతే, ఒకేసారి ఒక గంట గడుపుతాను అనే తీర్మానం చేసుకోకు. నీవు ఎంత చేయగలవో అది కొ.చెమైనా అంతటితోనే మొదలుపెట్టు.
• నిర్థిష్టమైనవి పెట్టుకో: ప్రేయర్ లిస్ట్ తయారు చేసుకో, బైబిల్ చదివే ప్లాన్ వాడటం మొదలు పెట్టు లేక ఈ దేవుని ప్రేమలేఖలు క్రమంగా చదివి, అందులో ఉండే బైబిల్ వచనాలు తెరిచి చదవడం అలవాటు చేసుకో.
• జవాబుదారీతనం కలిగి ఉండు: రోజూ తప్పకుండా దేవునితో సమయం గడుపుతున్నావో లేదో నిన్ను అడగమని నీ స్నేహితునికి చెప్పు.
• దేవుడు తప్పక సహాయం చేస్తారని నమ్ము: నీ సొంత శక్తి ద్వారా అయితే ఇది చేయలేవు, దేవుని సహాయం లేకపోతే.
గుర్తుపెట్టుకో : దేవుడు - మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు.. (ఎఫెసీయులకు 3:20)
8% శాతం ఎవరైతే సాధించారో అందులో మనం కూడా ఉందాం!
4 Tips for Keeping New Year's Resolutions


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.