మనమెప్పుడైతే మన భారాలు మనమే మోస్తామో, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తామో, మన సొంత శక్తితో పని చేస్తామో, దేవునితో అడుగు వేయడంలో తప్పిపోయినట్టే.
మనకు కాడి అవసరం. అది మనలను క్రీస్తుతో మనలను సంబంధంలో ఉంచి, ఆయనతో మనం అడుగులో అడుగు వేసేలా ఉపయోగపడుతుంది :
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. (మత్తయి 11:28-30)
క్రీస్తు కాడి మనలను ఆయన ఎక్కడ నడిస్తే అక్కడకు నడిపిస్తుంది :
1. క్రీస్తు యొక్క వాక్యం మనలో సమృద్దిగా నివసించుట ద్వారా (కొలస్సీ 3:16).
2. గొప్ప ప్రజాదరణ పొందిన లోకానుశారమైన సిద్ధాంతాలను తృణీకరించుట ద్వారా (కొలస్సీ 2:8).
3. ఆయన ప్రణాళికలను వెంబడించుట ద్వారా (ఎఫెస్సీ 2:10).
4. ఆయన శక్తిలో, బలములో జీవించుట ద్వారా (ఫిలిప్పీ 4:13).
యేసు చెప్పెను - ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును. (యోహాను 12:26)
అన్నింటికన్నా ఉన్నతమైనది ఏమిటంటే, మనమెప్పుడైతే క్రీస్తుతో అడుగులో అడుగు వేస్తామో, మన ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది.
-----------------
"కాడి (zygós) - ఇది సరైన కాడి; ఇది ఒక చెక్కతో చేయబడిన అడ్డు కర్ర వంటిది. రెండు జంతువుల మెడలమీద అది పెట్టినప్పుడు అవి రెండూ కలిసి ఒకటే వైపు లాగుతాయి ; (ఉపమానంగా) ఏదైతే కలుపుతుందో (సంబంధం) ఇద్దరు వ్యక్తులు ఒకటిగా కదులుతారు (పనికి)"


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.