భార్యను చంపడానికి ప్రయత్నించిన భర్త, కుటుంబంలో వారసత్వంగా వచ్చిన తీవ్రమైన అనారోగ్యం, స్నేహితుడు రోజూ శారీరిక నొప్పిలో జీవించాల్సిన పరిస్థితి. వీరంతా నాకు వ్యక్తిగతంగా తెలుసు. కాని వీరు స్వజాలిలో జీవించడాన్ని తిరస్కరించినవారు.
వీరికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్న వారు కూడా నాకు తెలుసు. వీరు తమ సమస్యల్లో మునిగిపోయి, వాటిల్లో పడి దొర్లుతూ ఉంటారు. నిజానికి వీరే సమస్యలను సృష్టించుకుని, వాటి పర్యావసానాల వలన ఇతరులను నిందిస్తుంటారు.
ఈ రెండో గుంపులో నేను ఎప్పుడు లేను అని చెప్పాలని ఆశపడుతున్నాను, కాని ఈ గుంపులో నేను కూడా ఉన్నానని చెప్పక తప్పదు.
కాని, అందులోనే జీవించడాన్ని నేను తృణీకరిస్తాను.
• స్వజాలి మనలను నాశనం చేస్తుంది, దానిని నుండి గనుక మనం తప్పించుకోకపోతే.
• స్వజాలి వలన సరైన దృక్పధాన్ని పోగొట్టుకుంటాం. ప్రతీదాన్ని విమర్శించే వారిగా, స్వార్ధపరులుగా అది మనలను మార్చేస్తుంది.
• స్వజాలి వలన ఇతరుల పట్ల గౌరవాన్ని పోగొట్టుకుంటాం, దేవుడిచ్చిన అవకాశాలను కూడా పోగొట్టుకుంటాం.
కాబట్టి దీనిని ఎలా జయించాలి? ఈ క్రింది వాటిని ప్రయత్నించు :
1. ప్రతీ ఉదయం ఫిలిప్పీ 2:1-8 చదివి, ఆ రోజు ఎవరికి దీవెనకారంగా ఉండాలో దేవుని అడుగు.
2. ప్రతీ మధ్యాహ్నం ఫిలిప్పీ 3:12-14 చదివి, ముందుకు సాగడానికి దేవుని సహాయాన్ని అడుగు.
3. ప్రతీ సాయంత్రం ఫిలిప్పీ 4:8 చదివి, నీ ఆశీర్వాదాలను లెక్కించు.
నీ మీద నీకు జాలిగా అనిపిస్తుందా? దయచేసి అక్కడ మాత్రం నివసించకు!


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.