"పగ అనేది నువ్వు విషం తీసుకొని, ఎదుటి వ్యక్తి చావాలని ఎదురుచూడటంలాంటిది"
నేను కూడా ఈ పగతో కొన్నిసార్లు పోరాటం చేస్తుంటాను. కాబట్టి ఈ పై కొటేషన్ నిజమే కదా అనిపిస్తుంది!
పగను గుర్తించే కొన్ని సూచనలు :
1. ఆ వ్యక్తి గురించి బాధ లేక కోపం లేకుండా ఆలోచించలేకపోవడం.
2. ఆ వ్యక్తికి ఏదైనా మంచి జరిగితే బాధ కలగడం.
3. నీ మనసులో ఆ వ్యక్తితో తరుచూ వాదించడం.
పగ అనేది ఆత్మీయంగా, శారీరికంగా, మానసికంగా మనలను విషపూరితం చేస్తుంది.
కాబట్టి ఈ పగ అనే విషాన్ని తాగడం ఎలా ఆపేయాలి?
1. అది విషం అని ముందు నమ్మాలి - అది సాతానుకు నీ హృదయంపై ఒక బలమైన పట్టునిస్తుందని అర్ధం చేసుకోవాలి (ఎఫెసీ 4:27).
2. ఆ నిష్ఫలమైన ఆలోచనలు మొదలైన వెంటనే నిన్ను గాయపరిచిన ఆ వ్యక్తి కోసం వెంటనే ప్రార్ధన చేయాలి (మత్తయి 5:44).
3. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నాలు ఆపేసి, దేవునితో నడుస్తూ ముందుకే సాగాలి (ఫిలిప్పీ 3:13,14).
4. సువార్త నిమిత్తం నీ కోరికలను విడిచిపెట్టడానికి ఇష్టపడాలి (ఫిలిప్పీ 2:5-7). దేవుడు తగిన సమయంలో ఆయన చిత్తాలను నెరవేరుస్తారు.
"కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము". (రోమా 12:21)
ఇవి చేయడానికి సహాయం చేయి ప్రభువా!🙏🏼
4 Ways to Stop Drinking the Poison of Bitterness


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.