యేసు, లూకా 9:23,24 లో, నీ సిలువను ఎత్తుకోవడం గురించి చెప్పిన వెంటనే, "తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును". అని చెబుతారు.
పడిపోయిన మన మానవ నైజం ఈ క్రింది సూత్రాలను ప్రేమిస్తుంది :
• సొంత కోరికలను తీర్చుకోవడం
• స్వీయ ప్రేమ
• సొంతగా అర్హత ఉందని నమ్మడం
• సొంత మార్గాల్లో పనులు చేయడం
కాని బైబిల్ ఏమి ఆజ్ఞాపిస్తుందంటే :
• తనను తాను తృణీకరించుకోవడం - రోమా 12:1; మత్తయి 16:24-27
• తగ్గింపు కలిగి ఉండటం - యాకోబు 4:10
• దేవుని అర్హతను నమ్మడం - ఫిలిప్పీ 3:7-11
• దేవుని మార్గాల్లో పనులు చేయడం - యోహాను 15:5-7
ఈ లోకం మరియు మన స్వార్ధ మానవ నైజం, మనలను ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో మనం చాలా అరుదుగా గ్రహిస్తుంటాం. దేవుని కంటే ఎక్కువ నా సొంత సామర్ధ్యాన్ని నమ్ముకోవడం, నన్ను నేను తృణీకరించుకోవడం కంటే నా సొంత కోరికలను తీర్చుకోవడాన్నే నేనెక్కువ ఎన్నుకుంటుంటానని ఒప్పుకుంటున్నాను.
కాని వెంటనే, నా కోసం సిలువను ఎత్తుకోవడం మాత్రమే కాదు, నా కోసం మరణించిన ఆయన్ను నేను జ్ఞాపకం చేసుకుంటాను.
నిజమైన శిష్యులుగా, నిజంగా సిలువను మోసేవారంగా మనం ఉండటానికి దేవుని సహాయం కోరదాం. అలాగ గనుక మనం ఉంటే, ఈ లోకాన్ని ఎంతగా ప్రభావితం చేయగలమో ఒక్కసారి ఊహించండి!!


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.