మళ్ళీ ఓడిపోవడం!

ఓటమికి వివిధ రకాలుగా మనుషులు స్పందిస్తారు. కాని అలా ఓడిపోయినప్పుడు ఏం చేయాలో బైబిల్ చెబుతుంది!


ఆదాము అవ్వలకు దేవుడు అన్నీ ఇచ్చారు, కాని వారికి ఇంకా కావాలి!


జలప్రవాహానికి ముందు, పరిస్థితులు చాలా పాడైపోయాయి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది (ఆదికాండము 6:5).


దేవుడు ఇశ్రాయేలేయులను ఎన్నుకున్నప్పుడు, ఆయన ఎంతగా వారిని ఆశీర్వదించినా, ఆయన ఇచ్చే హెచ్చరికలను మాత్రం వారు పదే పదే నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు.


పౌలు కూడా "నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను" అంటున్నాడు . (రోమా 7:19)


నీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా?


నీ పిల్లలను అరవకూడదు అని నిర్ణయం తీసుకున్నావు.


నీ అదనపు బరువును తగ్గించుకోవడానికి నిశ్చయించుకున్నావు.


దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుతాను అని దేవునికి మాటిచ్చావు.


కాని పాటించలేకపోతున్నావు.


అప్పుడు ఏం చేయాలి?


వదిలిపెట్టేయాలా?


నువ్వు క్షమించబడ్డావు గనుక చేసినా చేయకపోయినా ఏం పర్వాలేదు అని నిర్ణయించుకోవాలా?


లేదు, అలా చేయకూడదు!


"వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను." (ఫిలిప్పీ 3:13,14)


నువ్వు గనుక దేవుణ్ణి బాధపెడితే, యదార్ధంగా నీ పాపాన్ని ఒప్పుకో. మళ్ళీ కొత్తగా నీ ప్రయత్నాలు మొదలుపెట్టి, దేవునికి నీ ఉత్తమమైనది అందించు!


Failed Again!


ఓటమికి వివిధ రకాలుగా మనుషులు స్పందిస్తారు. కాని అలా ఓడిపోయినప్పుడు ఏం చేయాలో బైబిల్ చెబుతుంది!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.