మనం క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, మన పడిపోయిన, స్వార్ధపూరితమైన కోరికలపై మనం యుద్దాన్ని ప్రకటించాం అన్నమాట. అప్పుడు మన జీవితం యొక్క ఉద్దేశ్యం మారిపోయింది అని తెలుసుకుంటాం.
కేవలం పరలోకానికి వెళ్ళటానికి మాత్రమే కాదు, ఒక ఉద్దేశ్యంతో ఈ లోకంలో జీవించడానికి మనం రక్షించబడ్డాం.
*మన నూతన పిలుపు ఏమి కలిగి ఉందటే :*
*పరిశుద్ధత* : ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను (తీతుకు 2:14). ఎఫెసీయులకు 1:4 కూడా చూడండి.
*సత్క్రియలు* : మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము - ఎఫెసీయులకు 2:10. 1 పేతురు 4:11 కూడా చూడండి.
*దేవునికి మహిమ తేవడం* : మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి - మత్తయి 5:16. 1 పేతురు 2:12, 1 కొరింధీయులకు 6:19, 20, 1 కొరింధీయులకు 10:31 కూడా చూడండి. మన జీవితాలలో ఈ చివరి ఉద్దేశ్యo నెరవేరితే మిగతావన్నీ నెరవేరినట్టే. ప్రియమైన క్రైస్తవులారా, దేవదేవుని మహిమపరుద్దామా !!
The Purpose of Every Believer
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.