శోధనలను జయించుట చాలా కష్టమే కాని, అసాధ్యమైతే కాదు.
మనం ఎంత ఎక్కువగా శోధనలకు వద్దు అని చెప్తామో అది అంతగా నిగ్రహశక్తిని మనలో పెంచి, ఇంకోసారి వద్దు అని చెప్పడాన్ని చాలా సులువు చేస్తుంది.
"సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును" - 1 కొరింథీయులకు 10:13
*4 మెట్లు* :
1. *గుర్తుపెట్టుకో* : ఇతరులెందరో శోధనలను జయించారు కాబట్టి నువ్వు కూడా వాటిని జయించడం సాధ్యమే.
2. *నమ్మకం* : మన సామర్ధ్యానికి మించి మనం దేనివల్లా గాని లేక ఎవరివల్లా గాని శోధించబడటానికి దేవుడు అనుమతిని ఇవ్వరు. ఇది ఒక భావన కాదు గాని వాస్తవము.
3. *చూడు* : ప్రతీ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు తప్పకుండ దయచేస్తాడు. కాని దానికోసం మనం చూడాలి.
4: *పారిపో* ! ప్రియమైన దేవా, గుర్తుపెట్టుకోవడం, నమ్మకముంచడం, చూడడం మరియు పారిపోవడం ద్వారా ప్రతీ శోధనలో నిలబడగలిగేలా సహాయం చేయండి. ఆమెన్ !
4 Steps For Avoiding Temptation - 1 Cor. 10:13
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.