తప్పుడు ఉద్దేశాలతో మంచి చేయడం

మంచి చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి కాని కొన్నివాటి వెనక చెడు ఉద్దేశాలు ఉండొచ్చు. వాటినే ఈరోజు ఒక నిమిషం ధ్యానాంశంలో చూడొచ్చు !


చాలామంది వేరువేరు కారణాలవల్ల పాపం చేయడానికి తిరస్కరిస్తారు : 

దొరికిపోతానేమో అనే భయంతో ఒకవ్యక్తి తప్పుడు సంబంధo పెట్టుకోవడానికి నిరాకరించవచ్చు. అతడు దొరికిపోతే జరిగే వాటికి భయపడి ఆ తప్పు చెయ్యట్లేదు కానీ తన భార్య మీద లేక దేవుని మీద ప్రేమతో కాదు. 

కొందరు కేవలం ఇతరుల దగ్గర మెప్పుపొందటం కోసమే వారికి సహాయం చేసే వారిగా ఉంటారు. (1) 

కొందరైతే ఇతరులు చూసేటప్పుడే మంచి చేయొచ్చు లేక వారెవరో తెలియని వారిని మోసం చేసి, తన స్నేహితులకు మంచి చేయొచ్చు. (2)

ఇలా మంచి చేయడానికి వేరువేరు కారణాలు ఉండొచ్చు, కానీ కొలస్సీయులకు 1:10-12 లో దానికి ఒక శ్రేష్టమైన కారణం చెప్పబడింది 

ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు చున్నాము. (3). 

"మనము మేలుచేయుటయందు విసుకక యుందము మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము" గలతీయులకు 6:9

Right Thing, Wrong Reason

మంచి చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి కాని కొన్నివాటి వెనక చెడు ఉద్దేశాలు ఉండొచ్చు. వాటినే ఈరోజు ఒక నిమిషం ధ్యానాంశంలో చూడొచ్చు !








మంచి చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి కాని కొన్నివాటి వెనక చెడు ఉద్దేశాలు ఉండొచ్చు. వాటినే ఈరోజు ఒక నిమిషం ధ్యానాంశంలో చూడొచ్చు !





----------

 (1) మత్తయి 6:1 లో యేసుక్రీస్తు దీని గురించి చెప్పారు (2) గలతీయులకు 1:10 లో పౌలు దీని గురించి చెప్పారు (3) మనం మంచి చేస్తే శ్రమపడే అవకాశాలు ఉన్నా మంచినే చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి (1 పేతురు 3:14)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.