ఏది నిజమైన ప్రేమ కాదు?

ఒక్క నిమిషం లోనే చదువగలిగిన ఈరోజు వాక్య ధ్యానం మనలకు దేవుని పరిపూర్ణమైన ప్రేమ ఎలా వర్తిస్తుందో నాలుగు విధాలుగా వివరిస్తుంది. ఆయన ప్రేమను దీనిద్వారా మరింత మెరుగుగా మనం అర్ధం చేసుకోవచ్చు.


దేవుని ప్రేమ తీర్పు తీర్చని, ఏమి ఆశించని, నిరుత్సాహపడని లేక క్రమశిక్షణ కోరని ప్రేమ అని చాలా మంది చెప్పడం నేను తరుచూ వింటుంటాను. 

మన స్వంత దేవుళ్లను మనమే సృష్టించుకోవడం మనం సహజంగా ఇష్టపడుతాం కాని నిజమైన ప్రేమ ఏవిధంగా ఉంటుందో బైబిల్ ఈ విధంగా వివరిస్తుంది. 

దేవుని ప్రేమ తీర్పు తీర్చేది, బదులు ఆశించేది, నిరుత్సాహానికి గురి అయ్యేది, క్రమశిక్షణలో నడిపించేది. 

నాలుగు విధాలుగా దేవుడు మనలను ప్రేమిస్తాడు :

♥️ఒక పరిపూర్ణమైన తండ్రిగా - పోషించే, క్రమపరిచే, దృఢంగా ఉండే, క్షమించే, సరదాగా ఉండే, అలానే మన విధేయతను గౌరవాన్ని ఆశించే తండ్రి వలే. 

♥️ఒక పరిపూర్ణమైన భర్తగా - మృదువుగా ఉండే, రక్షించే, నమ్మకంగా ఉండే, అలానే తిరిగి మన నమ్మకత్వాన్ని ఆశిందే భర్త వలే . 

♥️ఒక పరిపూర్ణమైన కాపరిగా - మన బలహీనతలు ఎరిగిన, ఎప్పుడూ మనతో ఉండే, ఎప్పుడూ మనలను నడిపించే, అలానే మనం వెంబడించాలని ఆశించే కాపరి వలే. 

♥️ఒక పరిపూర్ణమైన కుమ్మరిగా* - జాగ్రత్తగా ఉండే, ఒక ఉద్దేశ్యంతో ఉండే, నైపుణ్యం ఉండే, అలానే మన జీవితాలలో ఆయన చేతులకు లోబడాలి అని ఆశించే కుమ్మరి వలే. 

ఇది నిజమైన ప్రేమ అంటే. ఇది బలహీనమైనది కాదు. దీనికి నాణ్యత కలిగిన ప్రమాణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక అభిమానం మాత్రమే కాదు. కనుక ఇలాంటి ప్రేమను బట్టి మనం ఎల్లపుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. 

మన కోరికల ప్రకారం స్వంత దేవుళ్లను మనమే సృష్టించుకోవచ్చు కాని అవేవి బైబిల్ వివరించే నిజమైన సజీవమై మన దేవుని యొక్క పరిపూర్ణమైన స్వభావానికి గుణాలకు ఎప్పటికి సాటి కావు. 

---------------- 
అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? (రోమీయులకు 9:20)

What True Love Isn't

ఒక్క నిమిషం లోనే చదువగలిగిన ఈరోజు వాక్య ధ్యానం మనలకు దేవుని పరిపూర్ణమైన ప్రేమ ఎలా వర్తిస్తుందో నాలుగు విధాలుగా వివరిస్తుంది. ఆయన ప్రేమను దీనిద్వారా మరింత మెరుగుగా మనం అర్ధం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.