హబక్కూకు యొక్క విశ్వాస తీర్మానము


మనలో ప్రతీ ఒక్కరం తప్పనిసరిగా స్మరణ చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన విశ్వాసపు తీర్మానం బైబిల్ లోని హబక్కూకు అనే చిన్న పుస్తకంలో చూడొచ్చు!

పాత నిబంధన గ్రంధంలోని ఒక ప్రవక్త హబక్కూకు. ఆ గ్రంధాన్ని మనం చదివితే మొదట ఆయన ఒక నిరాశాపరుడుగా లేక ఫిర్యాదు చేసే వ్యక్తిగా మనకు కనిపించవచ్చు (హబక్కూకు 1). కానీ ఆయన్ని మనం అలా తీర్పుతీర్చకుండా జాగ్రత్తపడాలి . ఎందుకంటే ఇశ్రాయేలు చరిత్రలో అతి క్లిష్టమైన సమయంలో కూడా ఆయన ఎంతో నమ్మకమైన ప్రవక్తగా ఉన్నారు.

 చెప్పాలంటే ఆయన మనందరికీ ఎంతో మంచి మాదిరి చూపించారు. మొదట ఆయన పరిస్థితులను చూచి దేవుని న్యాయం ప్రభుత్వం చేయట్లేదేమో అని అనుకున్నప్పటికీ పరిస్థితులు దేవుని నమ్మకత్వాన్ని నిర్ధారించలేవు అని చివరికి గ్రహించగలిగేరు.

 సులువైన జీవితమో లేక గొప్ప ధనం లేక గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇస్తాను అని మనం వాగ్దానం చేయబడలేదు గాని దానికి మించిన దేవ దేవుని గొప్ప శక్తిని మనం వాగ్దానంగా పొందాం.

 హబక్కూకు యొక్క మూడు అధ్యాయాల పుస్తకం ఒక విజయవంతమైన విశ్వాసపు తీర్మానంతో ముగియబడింది. మనం కూడా దానిని ఎంతైనా హత్తుకోవలసిన వారమే : ఆ వాక్యము హబక్కూకు 3:17-19 లో ఈ విధంగా ఉన్నది

 "అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో షించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును".

 మీకున్న సమస్యలు ముందు పెట్టుకోని దాని
 వెంటనే ఈ వాక్యాన్ని గట్టిగా చదవాలని మీ అందరిని ప్రోత్సాహపరచాలని నేను ఇష్టపడుతున్నాను !

Habakkuk's Statement of Faith


ఫ్రీ గా సబ్స్క్రయిబ్ చేసుకోని ఒకసారి ఈ అవకాశాన్ని ఉపయోగించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు?

సబ్స్క్రయిబ్ ఎలా చేసుకోవాలి :
  • ·         సబ్స్క్రయిబ్ లింకను క్లిక్ చేయండి
  • ·         ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది
  • ·         మొదటి బాక్స్ లో మీ ఈమెయిలు టైప్ చేయండి
  • ·         "నేను రోబోట్ కాదు " అనే రెండవ బాక్స్ లోని ఆప్షన్ ను క్లిక్ చేయండి.
  • ·         "కంప్లీట్ సుస్క్రిప్షన్ రిక్వెస్ట్ " అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.
  • ·    అప్పుడు దేవుని ప్రేమలేఖలు సబ్స్క్రిప్షన్ సర్వీస్ ఫీడ్ బర్నర్ నుండి మీకు ఈమెయిలు వస్తుంది. మీకు ఈ ఈమెయిలు వచ్చినప్పుడు, సబ్స్క్రిప్షన్ నిర్ధారణ కోసం అందులో లింకును క్లిక్ చేయండి. 
ఇదంతా చేసిన తరువాత వారంలో మీకు దేవుని ప్రేమలేఖలు నుండి వాక్యం ధ్యానం మీ ఈమెయిలు కు వస్తుంది. మీకు ఇన్బాక్సలో రాకపోతే, దయచేసి మీ స్పామను చూడండి. ఒకవేళ స్పామ్ లో వస్తే, ఆ ఈమెయిలు ను ఇన్బాక్స్ లోకి మూవ్ చేయండి, ఇంకా అప్పటి నుండి మీ ఇన్బాక్స్ లోకే వస్తాయి.

ముఖ్య గమనిక: దేవుని ప్రేమలేఖలు మీ ఈమెయిలు ను వాక్యధ్యానాన్ని మీకు పంపడానికి మాత్రమే ఉపయోగిస్తుంది కాని ఇంకా వేరే ఏ ఉద్దేశాలు లేక వేరే ఉపయోగాలు చేయదు. నా బ్లాగ్ ట్రాఫిక్ కోసం స్టాటిస్టిక్స్ ని కలెక్ట్ చేస్తాను (బ్లాగ్ ను సందర్శించడం, పేజీను చూడటం మొదలైనవి) కేవలం నా వ్యక్తిగత అవసరానికి తప్ప దీనిలో వేరే ఉద్దేశ్యం లేదు. మీరు ఎప్పుడైనా అన్సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు.



మనలో ప్రతీ ఒక్కరం తప్పనిసరిగా స్మరణ చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన విశ్వాసపు తీర్మానం బైబిల్ లోని హబక్కూకు అనే చిన్న పుస్తకంలో చూడొచ్చు !



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.