పరిస్థితులు నిన్ను "మింగనీయకు"!

నీకు యోనా సూత్రం తెలుసా? నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి! అది ఏమిటో ఈ ఒక్క నిమిషంలోనే చదువగలిగే వాక్యధ్యానం వివరిస్తుంది.

కొన్నిసార్లు "దారితప్పడం" అనేది మన జీవితాల్లో దైవిక ప్రణాళికలో భాగం కావొచ్చు!

కాని కొన్నిసార్లు దారితప్పడం అనేది దైవ చిత్తాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడం వల్ల లేక దైవ ప్రణాళికలకంటే ముందుగా వెళ్లిపోవడం వల్ల కావొచ్చు. 

అలాంటప్పుడు ఆ "దారితప్పడాన్ని" దేవుడు మన భవిష్యత్తు ఆశీర్వాదాల కోసం సిద్ధపరచడానికి ఉపయోగిస్తాడు. 

కాని మరొక విధమైన "దారితప్పడం" ఒకటుంది. అది సహజంగా మంచిది కాదు. 

అది యోనా సూత్రాన్ని పాటిస్తుంది. దానిని "యోనా విధానంలో దారితప్పడం" అని అనవచ్చు:

"నువ్వు దేవుని నుంచి పారిపోదలుచుకుంటే, దాని వల్ల కలిగే పరిస్థితుల ద్వారా మింగివేయబడటానికి కూడా సిద్ధంగా ఉండాలి" అని. 

దేవుడు యోనాని పిలుచుకున్నాడు, కాని యోనా దైవ చిత్తం నుండి పారిపోవడం వల్ల దేవుడు ఒక పెద్ద చేప కడుపులో మింగివేయబడేలాగా అనుమతించాడు. 

మనం యోనాని చూసి "నీవు దేవుని దగ్గర నుండి పారిపోవడం ఎంత హాస్యాస్పదం" అని అనుకోవచ్చు. 

కాని దేవుని వాక్యంలో చెప్పబడిన తన్ను తాను ఉపేక్షించుకోవడం, పరిశుద్ధత కలిగి ఉండటం, ధృడంగా దేవుణ్ణి వెంబడించడం, జారత్వం నుండి తప్పించుకోవడం, దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెదకడం మొదలైన వాటి నుండి మనం పారిపోవడం కూడా యోనా ఆలోచన విధానానికి సమానమే. 

మన జీవితాల్లో కూడా ఏదైనా భాగంలో దేవుని ప్రణాళికల నుండి మనం పారిపోతున్నామేమో ఈరోజే దేవుణ్ణి అడుగుదాం !

మన పాపాలను మనం ఎంత త్వరగా దేవుని దగ్గర ఒప్పుకుంటామో, అంత త్వరగా దేవుడు మనలను "అవిధేయత అనే కడుపులోనుండి" బయటపడేలా చేసి మరలా తిరిగి ఆయన కోసం కొనసాగేలాగ చేస్తాడు !


Don't Let Circumstances "Eat" You



నీకు యోనా సూత్రం తెలుసా? నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి! అది ఏమిటో ఈ ఒక్క నిమిషంలోనే చదువగలిగే వాక్యధ్యానం వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.