కొలరాడోలోని లాంగ్ పీక్ అనే ప్రాంతంలో 400 సంవత్సరాలుగా ఒక పెద్ద మహా వృక్షం చాలా భయంకరమైన పరిస్థితులు కూడా తట్టుకొని నిలబడింది కాని ఒక చిన్న చెద పురుగుల గుంపు వచ్చి దానిని నాశనం చేసింది.
మనం నిర్మూలము చేయవలసినవి చేసే విషయంలో జాగ్రత్తపడకపోతే అవి దేనినైనా నాశనం చేయగలవు అనేదానికి ఈ అతి స్వల్పమైన అల్పమైన చెదపురుగు ఒక మంచి ఉదాహరణ.
చింత అనేది కూడా ఇలాంటిదే. మనకు నిజంగానే ఆర్ధికంగా, ఆరోగ్యంలో, సంబంధాలలో ఇలా అనేక విషయాలలో సమస్యలు ఉండొచ్చు.
ఎలాగైతే ఆ పురాతనమైన మహా వృక్షం కొలొరాడోలో శీతాకాలంలో వచ్చే భయంకరమైన పరిస్థితులను ఎన్నో సంవత్సరాలుగా తట్టుకోని నిలబడిందో అలానే మనం కూడా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడగలం. లేక అలాంటి అతి స్వల్పమైన చెద పురుగులవంటి భయాలకు చోటిచ్చి చింత మనలను దాడిచేసేలాగ అవకాశం కూడా ఇవ్వగలం.
చింత అనేది అవిశ్వాసానికి ఒక సూచన. అది మన పరిస్థితులకు దేవుడు సరిపోడు, లేక శాంతి సమాధానాల్ని మనం కలిగి ఉండలేము, లేక మనం ఈ ప్రస్తుత పరిస్థితులలో జీవించలేము అనే వివిధమైన అబద్దాలను నమ్మేలా చేస్తుంది. చింత అంటే
దేవుడిని తక్కువగా చూసి మనకున్న సమస్యలను ఉన్నవాటికంటే చాలా పెద్దవిగా చూడటమే.
నీవు దేనిగురించైనా చింతిస్తుంటే "ఆ స్వల్పమైన చెద పురుగులను" చెద పురుగులులానే చూడగలిగేలా మరియు మన దేవుని యొక్క మహా గొప్ప శక్తిని చూడగలిగేలా ఈరోజే ఆ దేవుడిని సహాయం అడుగు.
దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. (ఫిలిప్పీయులకు 4:6)
Worry is Based on a Small View of God


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.