అబ్రాహాము సమాధి

ఆత్మీయ పాముఖ్యత ఉన్నదిగనుకనే ఆదికాండములోని ఒక అధ్యాయం మొత్తం అబ్రాహాము సమాధి గురించి చెప్పడానికి కేటాయించబడింది. అది ఏమిటో ఈ ఒక్క నిమిషంలోనే చదవగలిగిన వాక్యధ్యానములో చూద్దాం!

మా తల్లిదండ్రులు వారి స్వంత ఊరిలో దాదాపు 50 సంవత్సరాలనుండి జీవించనప్పటికీ, వారు మరణించాక అక్కడే వారిని పాతిపెట్టాము.

మృతిచెందిన శారాని పాతిపెట్టడానికి ఒక గుహను అబ్రాహాము కొనడాన్ని ఆదికాండము 23వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు దీని గురించి ఆలోచించాను. బైబిల్ లో ఒక అధ్యాయం మొత్తం ఈ సన్నివేశానికే కేటాయించబడటం నేను గమనించి దానికి కారణం తెలుసుకోవాలనే ఆశ నాలో కలిగింది.

నేను కనుగొన్నది ఏంటంటే కనాను దేశంలో అబ్రాహాముకు తనకంటూ స్వంతంగా కనీసం ఒక్క చిన్న స్థలం కూడా లేదు. అతడు కనానులో ఒక పరదేశి. కాని దేవుడు అబ్రాహాము సంతతికి కనాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను అని వాగ్దానం చేసాడు (ఆదికాండము 17:8). ఆ వాగ్దానాన్ని పూర్తిగా నమ్మడం వల్లే ఆ కనాను దేశంలోనే తనకు మరియు శారాకు శ్మశాన భూమిని కొన్నాడు అబ్రాహాము.

నమ్మడం ఒక ఎత్తయితే, దానిని నిరూపించడం ఇంకో ఎత్తు!

చాలాసార్లు మనము విశ్వాసులము అని చెప్పుకుంటాము
కాని నాస్తికులులాగా జీవిస్తాము. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు లేదా ఏదైనా కఠినమైన పరిస్థితులలో వెళ్తున్నప్పుడు మనం ఒక విశ్వాసులముగా కాకుండా విశ్వాసం లేనివారంగా ప్రవర్తిస్తూవుంటాము.

నేనైతే అబ్రాహాములాగ నేను కూడా నమ్మినదానిని నిరూపించేలా జీవించాలని దేవునికి ప్రార్ధన చేసుకుంటున్నాను. మీరు కూడా నాతో కలిసి ఈ ప్రార్ధనతో ఏకీభవిస్తారా?

Abraham's Burial Plot


ఆత్మీయ పాముఖ్యత ఉన్నదిగనుకనే ఆదికాండములోని ఒక అధ్యాయం మొత్తం అబ్రాహాము సమాధి గురించి చెప్పడానికి కేటాయించబడింది. అది ఏమిటో ఈ ఒక్క నిమిషంలోనే చదవగలిగిన వాక్యధ్యానములో చూద్దాం!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.