దేవుని వాక్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు?

119 కీర్తనలలో కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు చదివి, నిన్ను నీవే కొన్ని ప్రశ్నలు వేసుకో...

నీవు :

1. దీనియందు సంతోషించి, ఉపదేశాన్ని పొందటానికి ఆశపడుతున్నావా? 
♥️నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. (కీర్తనల గ్రంథము 119:24)

2. సంస్కృతి, విలువలు మధ్య పోరాటాలలో, హింసింపబడే పరిస్థితులలో కూడా దీనినే నమ్ముకోని ఉన్నావా? 
♥️నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము. (కీర్తనల గ్రంథము 119:86)

3. దీనిని నీకు సంబంధించిన, వర్తించే, శాశ్వతమైన, మార్పులేని వాక్యం అనే నమ్మకాన్ని కలిగి ఉన్నావా? 
♥️యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. (కీర్తనల గ్రంథము 119:89)

4. దీనిని దినమంతా ధ్యానించాలనే  కోరిక నీకు ఉన్నదా? 
♥️నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. (కీర్తనల గ్రంథము 119:97)

5. దీనిని విశేష జ్ఞానానికి, వివేకానికి పరిపూర్ణ ఆధారముగా నీవు గుర్తించావా? 
♥️నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. (కీర్తనల గ్రంథము 119:98-100)

6. దీనిని సంప్రదిస్తున్నావా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు? 
♥️నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను. (కీర్తనల గ్రంథము 119:104)

7. దీనిని ఇహలోక సంపదలకంటే ప్రియముగా ఎంచుతున్నావా? 
♥️బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. (కీర్తనల గ్రంథము 119:127)

8. దీనిని తృణీకరించడం అసహ్యమైనదిగా భావిస్తున్నావా? 
♥️జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. (కీర్తనల గ్రంథము 119:136)

119 కీర్తన చదివి దేవుని వాక్యాన్ని ఘనంగా ఎంచుటలో మనం ఇంకా ఎదగాలని మీ అందరిని నేను ప్రోత్సాహిస్తున్నాను !

How Do You Feel About God's Word?


119 కీర్తనలలో కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు చదివి, నిన్ను నీవే కొన్ని ప్రశ్నలు వేసుకో...

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.