క్రైస్తవ యోధుల ముఖ్యమైన అయిదు విధులు

యేసుప్రభువును వెంబదించడం ఎప్పుడైతే మొదలుపెడతామో, ఈ అయిదు ముఖ్యమైన విధులకు కూడా మనం పిలువబడ్డాం అని అర్ధం. అవేమిటో ఈ ఒక్క-నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానం వివరిస్తుంది !


మనం యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నట్లయితే,
ఆయనతో పాటు యుద్ధరంగంలోకి వెళ్తున్నట్లే!

మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ లోక సంబంధులం మాత్రం కాదు (యోహాను 17:16). ఈ లోకంలో కేవలం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము (1 పేతురు 2:11, హెబ్రీయులకు 11:13-16)

మరియు మనం యోధులం:

1. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవలసినవారము (ఎఫెస్సీయులకు 6:11). 

2. ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను మనము పోరాడుచున్నాము. (ఎఫెసీయులకు 6:12)

3. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాల్సినవారం ఎందుకంటే మన విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. (1 పేతురు 5:8)


4. సంతోషంతో సేవించాలి ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేయుచున్నది (2 కొరింధీయులకు 5:14-15)


5. మన ముఖ్య లక్ష్యాన్ని, నినాదాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సినవారం :
"విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడిన" వ్యక్తివి . (1 తిమోతికి 6:12)


ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇది మనకు ఒక పరిచర్య చేసే స్థలం మరియు యుద్ధ భూమి.

5 Duties of Christian Warriors

యేసుప్రభువును వెంబదించడం ఎప్పుడైతే మొదలుపెడతామో, ఈ అయిదు ముఖ్యమైన విధులకు కూడా మనం పిలువబడ్డాం అని అర్ధం. అవేమిటో ఈ ఒక్క-నిమిషంలో చదువగలిగిన వాక్యధ్యానం వివరిస్తుంది !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.