నేను కొన్నిసార్లు 'రథములను' నమ్ముకుంటాను

దావీదు గొల్యాతును విజయవంతంగా ఓడించాడు. తన విజయానికి కీలకమైన దైవ గ్రంథంలోని ఒక ముఖ్యమైన వచనాన్ని ఈరోజు ఒక్క నిమిషం లోనే చదువగలిగిన వాక్యధ్యానంలో చూద్దాం !


కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు క్రుంగి నేల మీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. (కీర్తనలు 20:7, 8)

నేను కొన్నిసార్లు 'రథములను' నమ్ముకుంటాను:

•నా ప్రవృత్తిని, సామర్ధ్యాలను, అంతర్దృష్టిని
•నా దృష్టి కోణాన్ని మరియు బలాన్ని 
•మానవ అధికారాన్ని లేక మానవ జ్ఞానాన్ని
•స్నేహితులను లేక బంధువులను 

అయినా సరే ఎందుకు నేను ఓడిపోతున్నాను, ఎందుకు ఇంకా నాకున్న సమస్యలు నన్ను దాడిచేస్తూనే ఉన్నాయి అని అప్పుడు ఆశ్చర్యపోతుంటాను.

భయాందోళనను కలిగించే గొప్ప శూరుడైన గొల్యాతును దావీదు ఎదుర్కొన్నప్పుడు ఆ సమయంలో ఎవరిపై నమ్మకం పెట్టాలో దావీదుకు బాగా తెలుసు. అందులో దావీదుకు సరైన దృష్టి కోణం ఉంది. 

దావీదు: "నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను". (1సమూయేలు17:45)

నీ జీవితంలో కూడా ఆర్థికంగా, సంబంధాలలో, ఉద్యోగంలో, మానసికంగా, శారీరికంగా - నీకు భయాందోళన కలిగించే 'గొల్యాతు' వంటి సమస్యలు ఉన్నాయా?

కేవలం నీ దేవుని నామం ద్వారా మాత్రమే వాటిని జయించగలవు లేక వాటిలో ఓర్పు కలిగి ఉండటానికి బలాన్ని సంపాదించగలవు. 

దావీదు గొల్యాతును విజయవంతంగా ఓడించాడు. తన విజయానికి కీలకమైన దైవ గ్రంథంలోని ఒక ముఖ్యమైన వచనాన్ని ఈరోజు ఒక్క నిమిషం లోనే చదువగలిగిన వాక్యధ్యానంలో చూద్దాం !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.