నువ్వు విగ్రహారాధికునివో లేదో ఈ నాలుగు ప్రశ్నలు ద్వారా తెలుసుకో !



ఒక ప్రతిమనో లేక ఎదో ఒక రూపాన్నో ఆరాధిస్తే విగ్రహాలను గుర్తుపట్టడం చాలా సులభం.

కాని క్రైస్తవులకు కంటికి కనిపించని లేక అధునాతమైన విగ్రహాలు ఉండే అవకాశం ఉంది. అవి :

1.ఏ అపాయం చేయనివి అనిపించే ఆటలు, ఫ్యాషన్, ఆహరం, అలవాట్లు లేక అభిరుచులు కావొచ్చు.

2. మంచివి అనిపించే కుటుంబం, దైవ సంఘం, ఆరోగ్యం, ఫిట్నెస్ లేక రాజకీయాలు కావొచ్చు.

ఇవి విగ్రహాలు కాకపోవచ్చు కాని అయ్యే అవకాశం ఉంది.

మనం వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేదానిపై అది ఆధారపడి ఉంది :

1. రాజకీయాలు, ఇతర విషయాల గురించి ఆసక్తితో చర్చిస్తాం, కాని దేవుని విషయాల పై మాత్రం మౌనంగా ఉంటున్నామా?

2. మన అభిమాన జెట్టు ఓడిపోతుందేమో అనే ఆత్రుత మనకి బాగా ఉంటుంది, కాని ఆత్మీయంగా తప్పిపోయిన వారి గురించి ఏమి పట్టనట్టు ఉంటున్నామా?

3. మన కుటుంబానికి, స్నేహితులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము, కాని దేవునికి ఇవ్వడానికి మాత్రం మన దగ్గర సమయం సరిపోవట్లేదా?

4. మనం తినే ఆహరం విషయంలో అతి జాగ్రత్త కలిగి ఉంటాము, కాని మన ఆత్మలను ప్రభావితం చేసేవాటి గురించి కనీస జాగ్రత్త చూపగలుగుతున్నామా?

పౌలు థెస్సలొనీకయ సంఘ విశ్వాసులను యదార్ధమైన వారిగా గుర్తించారు, ఎందుకంటే వారు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులవ్వడం వలన (1 థెస్సలొనీకయులకు 1:9)

మరి నీ సంగతి ఏమిటి? నీవు విగ్రహాల నుంచి తిరిగిపోతున్నావా లేక విగ్రహాల వైపుగా తిరిగిపోతున్నావా? ఈరోజు కొన్ని కఠినమైన ప్రశ్నలు నిన్ను నీవే వేసుకోవటానికి దయచేసి సమయాన్ని కేటాయించు !






No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.