పరుగులో కొనసాగడానికి ఆరు మార్గాలు

మనం దేవునిలో పరిపక్వత చెందేకొద్దీ ఆటంకాలన్నీ వదిలిపెట్టి పరుగులో కొనసాగటానికి కావలిసిన ఆరు మార్గాలను ఈ ఒక్క నిమిషంలోనే చదువగలిగిన వాక్యధ్యానం వివరిస్తుంది!

పరిశుద్ధ లేఖనాలు విశ్వాసాన్ని ఎప్పుడూ ఒక పరుగుతో పోల్చడం చూస్తుంటాం.  ఈ "విశ్వాసపు పరుగును" పరిగెత్తడానికి జ్ఞానయుక్తమైన సూచనలను హెబ్రీయూలకు 12:1-3 మనకి ఇస్తుంది:

1. ఇతరులు ఈ పరుగుకు వచ్చే ఆటంకాలను అధిగమించారు గనుక మనం కూడా అధిగమించగలం. గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించి మనలను ప్రోత్సాహపరిచేదిగా ఉంది.

దీనిని కూడా చూడండి : 1 కొరింధీయులకు 10:13

2. ప్రతీ భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతీ పాపమును విడిచి పెట్టి, మన పాదములు వాటిలో చిక్కికోకుండా పాపం విషయం లో చాలా జాగ్రత్తపడుతూ ఉండాలి.

దీనిని కూడా చూడండి1 యోహాను 2:15-17

3. మన త్రోవ ఎత్తు పల్లాలతో ఉన్నాగాని, మన పాదాలు అలిసిపోయినా గాని మనం పరుగు పెడుతూనే ఉండాలి. ఇలా మాత్రమే మనం సహనాన్ని నేర్చుకోగలం.

దీనిని కూడా చూడండి : రోమీయులకు 5:1-5

4. "మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ" ఇరుకు మార్గంలోనే మనం కొనసాగాలి.

దీనిని కూడా చూడండి : ఎఫెస్సీయులకు 2:10

5. మనం కాని మన వ్యామోహాలు అనే ఆటంకాలు కాని మన గురి కాదు. మన యొక్క గురి యేసు ప్రభువు మాత్రమే. మన విశ్వాసానికి  ఆయన కర్తగా,  కొనసాగించేవాడుగా ఉన్నాడు. ఆయనే మనకు మార్గాన్ని కూడా చూపించాడు.

దీనిని కూడా చూడండి : ఎఫెస్సీయులకు 5:1-2

6. యేసు ఏ విధంగా తన యెదుట ఉంచబడిన 'మనలను రక్షించడం ద్వారా తాను పొందే ఆనందాన్ని' గుర్తుచేసుకున్నారో అలానే మనం కూడా మన రక్షణానందాన్ని గుర్తుచేసుకోవాలి. అది మాత్రమే ప్రతీ దానిని మనం సరైన కోణంలో చూడడానికి సహాయపడుతుంది.

దీనిని కూడా చూడండి : రోమీయులకు 12:1, 1 కొరింధీయులకు 6:20

ఇవి గనుక చేయగలిగితే మనం ఎప్పటికీ అలిసిపోము లేదా నిరుత్సాహపడము !

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.