ఎవరి విరిగిన హృదయం గురించి నీ కలవరం?

మనమందరం జీవితంలో ఏదో ఒక సందర్బంలో విరిగిన హృదయాలతో బాధపడుతుంటాము. కాని  దేవుని విరిగిన హృదయం గురించి ఈ వాక్యధ్యానంలో చూద్దాం!


మనకన్నా మన దేవుని హృదయాన్ని విరిచేవే మనలను ఎక్కువ కలవరపరచడం ఆత్మీయ పరిపక్వతకి గుర్తు - జిల్ బ్రిస్కో్


•తన అన్నల క్రూరత్వాన్ని బట్టి, పోతిఫరు భార్య నిందను బట్టి, పానదాయకుల అధిపతికి కృతజ్ఞత లేకపోవడం బట్టి యోసేపు హృదయం విరిగిపోయింది.


•తన సొంత దేశాన్ని విడిచి స్వేచ్ఛను కోల్పోయిన దాన్నిబట్టి దానియేలు హృదయం విరిగిపోయింది. (దానియేలు 1:1-6).


•తరుచూ కొట్టబడటం, హింసింపబడటం బట్టి పౌలు హృదయం విరిగిపోయింది.(2 కొరింథీయులకు 11:24-30).


వీరందరు మనలాంటి భావాలు కలిగినవారే. వీరు కూడా దుఖించారు, శ్రమపడ్డారు.


కాని వారికన్నా వారి దేవుని హృదయాన్ని విరిచేవే వారిని ఎక్కువ కలవరపరిచింది. (1)


అటువంటి పరిపక్వత నాకు లేదు. నేను దేవుని కంటే ఎక్కువ నా హృదయం విరిగిపోవడం గురించే ఆలోచిస్తాను బాధపడతాను.


కాని ఈ విరిగిపోవడం మనలను పరిపక్వతలోనికి, ఎక్కువగా దేవునిపై దృష్టి నిలపడంలోనికి నడిపించాలి గాని అది మనలను నాశనం వైపుకో  లేక మనపై మనం ఎక్కువ దృష్టి నిలిపే వైపుకో కాదు. (2 కొరింథీయులకు 1:8-9).


నిజంగా నేను నా హృదయం కంటే దేవుని హృదయం విరిగిపోవడం గురించి ఎక్కువ శ్రద్ద తీసుకోవాలని ప్రార్ధిస్తున్నాను. నీకోసం కూడా ఈ ప్రార్దన చేయమంటావా?


-----------------------


(1) విరిగిన దేవుని హృదయం గురించి దైవ లేఖనాలలో :
ఆదికాండము 6:5-6
కీర్తనలు 78 (78:40)
ఎఫెసీయులకు 4:30


God's Broken Heart or Mine?


మనమందరం జీవితంలో ఏదో ఒక సందర్బంలో విరిగిన హృదయాలతో బాధపడుతుంటాము. కాని  దేవుని విరిగిన హృదయం గురించి ఈ వాక్యధ్యానంలో చూద్దాం!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.