గ్రుడ్డివాడైయుండి చూచుచున్నాడు - లూయిస్ బ్రెయిలి

విశ్వాసం, చూపు రెండూ కలిసి పనిచేసిన జీవితం అది...  గ్రుడ్డివారు చదువగలిగేలా చేసిన లూయిస్ బ్రెయిలి యొక్క అశ్చర్యకరమైన జీవితచరిత్ర..!


మూడు సంవత్సరాల వయస్సులో లూయిస్ ప్రమాదం వల్ల చూపు పోగొట్టుకున్నాడు.


1800 ల్లో చూపు లేనివారికి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి, కాని లూయిస్ సాధారణమైన అబ్బాయి కాదు. చదువుకోవాలి అనే తీవ్రమైన ఆకలి అతనిని గుడ్డివారు చదువుకోవడానికి ఉపయోగపడే ఎత్తు ఎత్తుగా ఉండే చుక్కల పరికరాన్ని కనిపెట్టేలాగా ప్రేరేపించింది.


గుడ్డివారికి చదవడం వ్రాయటం సాధ్యమైంది లూయిస్ బ్రెయిలి వల్లనే, అప్పుడు అతని వయస్సు కేవలం 12 సంవత్సరాలు. అప్పటినుండి పేరు ప్రాఖ్యాతలు అనేవాటినుండి తప్పించుకుంటూ నిస్వార్ధమైన సేవా జీవితాన్ని జీవిస్తూ, 42వ ఏట క్షయరోగము వలన మరణించడం జరిగింది.


లూయిస్ బ్రెయిలికు శారీరిక చూపు లేకపోయినప్పటికీ, ఆత్మీయ చూపులో మాత్రం అతనికి ఏ లోపము లేదు.


ఈ భూమిపై దేవుని కోసం సేవ చేసిన తృప్తితో లూయిస్ బ్రెయిలి తాను మరణిస్తున్న సమయంలో చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి :


"దేవుడు నా కనుల ముందు ప్రకాశమానమైన నిత్యత్వపు నిరీక్షణ ఉంచడానికి ఇష్టపడియుండగా.. అది చూసిన తరువాత ఇంక ఈ భూమిలో ఉన్నదేదీ నన్ను కట్టివేయడం అసాధ్యమే!" అని


ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. (1 కొరింథీయులకు 2:9)


"ప్రియ ప్రభువా, మాకు ఆత్మీయ చూపును దయచేయండి"!✝️


Blind But Seeing - Louis Braille

విశ్వాసం, చూపు రెండూ కలిసి పనిచేసిన జీవితం అది...  గ్రుడ్డివారు చదువగలిగేలా చేసిన లూయిస్ బ్రెయిలి యొక్క అశ్చర్యకరమైన జీవితచరిత్ర..!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.