మన గురి సంతోషమా?

మన సంఘాల్లో సంతోషం గురించి, క్రైస్తవులుగా ఉండటం గురించి తప్పుడు అపోహలు ఉన్నాయి. అవి ఏమిటో ఈ వాక్యధ్యానం వివరిస్తుంది!


దేవుని కోరిక మనలను సంతోషపరచడమేనా?


సంతోషం అంటే "ఆనందమో లేక సంతృప్తి" అయితే, జవాబు అవును. ఎందుకంటే "సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. (1 తిమోతి 6:6)  అని బైబిల్ చెబుతుంది.


ఒకవేళ సంతోషం అంటే "అంతా ఆహ్లాదంగా ఉండి, అన్నీ సుఖలే కావాలి" అనేది అయితే, దానికి జవాబు కాదు అనాల్సిందే.


ఎందుకంటే యేసు ప్రభువు అన్నారు "నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను". (యోహాను 16:33)


మన విషయంలో దేవుని గురి పరిశుద్ధతే కాని సంతోషం కాదు (1 పేతురు 2:9)


దురదృష్టం ఏమిటంటే సంతోషం కొరకైన తీవ్రమైన కోరిక సంఘంలోకి కూడా చొరబడి అనేకులను పరిశుద్ధత వైపుకు తప్ప ఇంక వేరే ఎటువేపైనా మళ్ళించే విధంగా అది  ప్రోత్సాహిస్తుంది అని గమనించాలి !


మనం....
•సమయాన్ని వృధా చేస్తాం
•మనకు అవసరం లేనివి మన స్తోమతకు మించినవి కొనుక్కుంటాము
•మన భాధ్యతలను విస్మరిస్తాము
•మన పిల్లలను అతిగా గారాబం చేసి, వారిలోని స్వార్ధాన్ని సమర్థిస్తాము
•ఇతరుల అవసరాలను నిర్లక్ష్యం చేస్తాం
•దేవునికి కానుకలు పిసినారుల్లాగా ఇస్తుంటాము


సంతోషాన్నే వెతికేవారిగా ఉంటే అది మనలో ఎక్కువ స్వార్ధాన్ని పుట్టిస్తుంది. ఆ విషయంలో అనేక మందిలానే నేను కూడా దోషిని.


ఈరోజు నుండి దేవుణ్ణి సంతోషపెట్టడమే మన గురిగా పెట్టుకుందాం :

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. (రోమా 12:1)

---------------------------------

పరిశుద్ధ గ్రంధం ప్రకారం ఆనందం మరియు సంతృప్తి అనేవి మన పరిస్థితులపై ఆధారపడి ఉండవు. అందుకే పౌలు చెరసాలలో ఉండి కూడా పదేపదే ఆనందించుడి అని చెప్పగలిగారు (ఫిలిప్పీయులకు)

Should Happiness Be Our Goal?


మన సంఘాల్లో సంతోషం గురించి, క్రైస్తవులుగా ఉండటం గురించి తప్పుడు అపోహలు ఉన్నాయి. అవి ఏమిటో ఈ వాక్యధ్యానం వివరిస్తుంది!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.