రక్షకుడైన మోషే


మోషే యొక్క గొప్ప ఆత్మవిశ్వాసం అతన్ని ఎలా గజిబిజి చేసిందో ఈ ఒక్క నిమిషంలో చదువగలిగిన వాక్యధానంలో చూద్దామా!

మోషే తనను తాను ఒక రక్షకునిలా చూసుకున్నాడు (నిర్గమకాండం 2:11-25).


ఒక హెబ్రీయుడిని రక్షించబోయి, ఒక ఐగుప్తీయుడిని చంపి, తన ప్రాణాన్ని  కాపాడుకోవడం కోసం పారిపోయాడు.


మిద్యాను దేశం చేరాక తాను మొట్టమొదట చేసిన పని ఏమిటంటే, రగూయేలు కూతుళ్ళను, ఏడిపించే గొర్రెల కాపరులనుండి రక్షించడం (వారిలో ఒకామె తన భవిష్యత్తు భార్య).


తరువాత సంవత్సరాలలో మోషేలో చాలా మార్పు వచ్చింది. తన మీద తనకి ఉన్న ఆత్మ విశ్వాసాన్ని మోషే పూర్తిగా కోల్పోయాడు.


ఫరో యొక్క దత్తత మనమడుగా మోషేకు తన మీద తనకి చాలా నమ్మకం భరోసా ఉండేవి. చాలా ధైర్యవంతుడు కూడా. అతను ఉన్న స్థానం ఎంతో ప్రభావంతో , గొప్ప శక్తి సామర్ధ్యలతో ఉన్నటువంటిది. ఇలాంటి మోషేను దేవుడు ఉపయోగించుకోవచ్చు.


కాని తనను తాను ఒక రక్షకునిగా ఇంక ఊహించుకోలేని ఒక ఒంటరి-పిరికి-వృద్ధ గొర్రెల కాపరిగా మారిన మోషేను దేవుడు ఎన్నుకున్నాడు (నిర్గమకాండం 4:1-17)*


గొప్ప ఆత్మ విశ్వాసం, వారి సామర్ధ్యంపై నమ్మకం, ఏదైనా సాధించగలం అని నమ్మే వారినే మనం నాయకులుగా ఎన్నుకుంటాము. ఎన్నుకోవడం మాత్రమే కాదు వారిని అనుకరించడానికి కూడా ప్రయత్నిస్తాము.


కాని మోషేలో తన మీద తనకి ఉన్న ఆత్మవిశ్వాసం అంతా ఆవిరి అయిపోయే వరకు దేవుడు ఎదురుచూసాడు. ఎందుకంటే అప్పుడు గాని మోషే దేవునిపై విశ్వాసం నమ్మకం పెట్టలేడు కాబట్టి (1 పేతురు 5:6). మనం కూడా మనపై కాక మన గొప్ప దేవునిపై నమ్మకం పెట్టుకోవడమే గురిగా కలిగి ఉందాం.

-----------------------

*మండుచున్న పొద దగ్గర మోషే చెప్పిన సాకులకు దేవుడు తనను ఖండించారు.. దీని అర్ధం దేవుడు మోషేకు తన మీద తాను నమ్మకం పెట్టుకోవాలని చెప్పే ప్రయత్నం కాదు కాని తనను పిలిచే గొప్ప దేవునిపై నమ్మకం పెట్టుకోవాలని నేర్పించడమే !

Moses to the Rescue


మోషే యొక్క గొప్ప ఆత్మవిశ్వాసం అతన్ని ఎలా గజిబిజి చేసిందో ఈ ఒక్క నిమిషంలో చదువగలిగిన వాక్యధానంలో చూద్దామా!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.