యేసుతో కలిసి మెలుకువగా ఉందామా?

యేసు తన మరణానికి ముందు శిష్యులను ఒకటి చేయమని అడిగారు కాని వారు తిరస్కరించారు. ఆయన మనలను కూడా ఇప్పుడు అదే అడుగుతున్నారు. మనం కూడా తిరస్కరిద్దామా?

మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండుడి..~ యేసు (మత్తయి 26:38)


మన శ్రమలలో, ఒత్తిళ్లలో,దుఃఖంలో, నిరుత్సాహాలలో ఈ వాక్యాన్ని చదువుతూ, క్రీస్తు మన కోసం పొందిన శ్రమలను ధ్యానించాలి.


ఎందుకంటే మన పరిపూర్ణుడైన ప్రభువు 'తన ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖమును' అనుభవించారు కాబట్టి.


"ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను". (లూకా 22:45)


వైద్యడైన లూకా ఈ విషయాన్ని ఆశక్తికరంగా వివరించారు. విజ్ఞాన శాస్త్రంలో దీనిని 'హేమాటిడ్రోసిస్' అంటారు.


లోకపాపభారాన్ని తన బాధ్యతగా మోయాలి, అలానే తండ్రి నుండి ఎడబాటు పొందాలి అనేవి ముందుగానే తలుచుకోని మన ప్రభువుకు తన చెమట గొప్ప రక్తబిందువులవలె నేలనుపడటం జరిగింది. ఆయన ఒక సాధారణ మానవుడుగా శ్రమను అనుభవించారు.


యేసు క్రీస్తు ప్రభువు తన అవసరతలో తనతో పాటు మెలుకువగా ఉండమని శిష్యులను అడిగారు, కాని వారు నిద్రించారు. (1)


ఇప్పుడు ఆయన మనలను కూడా 'మెలుకువగా' ఉండమని.. ఆయన తిరిగి వచ్చేవరకు ఆయన అప్పగించిన పనిని చేయమని చెప్తున్నారు (మత్తయి 25:13; మార్కు 13:33).


మనము నిద్రించక మెలుకువగా ఉందామా?

-----------------

 

(1) నేను మొదటిసారి శిష్యులు నిద్రించడం గురించి చదివినప్పుడు చాలా బాధపడ్డాను. కాని నాకు తర్వాత అర్థమైంది ఏమిటంటే యేసు పొందబోయే శ్రమలు గురించి అప్పటికి వారికి సరైన అవగాహన లేదు, అలానే వారిలో దేవుని ఆత్మ నివసించలేదు ఎందుకంటే అప్పటికి వారింకా పరిశుద్దాత్మ శక్తిని పొందలేదు గనుక (అపొస్తలలు కార్యములు 1:8). కాని మనము అలాకాదు...మనం దేవుని ఆత్మను పొందాము అలానే సిలువలో ప్రభువు సాధించిన దానిగురించి మనకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి దయచేసి మనం మెలుకువగా ఉందాము ప్రియా క్రైస్తవులారా!


Keeping Watch with Jesus


యేసు తన మరణానికి ముందు శిష్యులను ఒకటి చేయమని అడిగారు కాని వారు తిరస్కరించారు. ఆయన మనలను కూడా ఇప్పుడు అదే అడుగుతున్నారు. మనం కూడా తిరస్కరిద్దామా?



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.