యేసు నీ బాధను అర్థం చేసుకుంటాడు

నువ్వు తృణీకరించబడినపుడు, వెక్కిరించబడినపుడు, వేధించబడినపుడు, ఒంటరితనంలో ఉన్నపుడు.. యేసును గురించిన ఈ సత్యాలు నీకు ఎంతో ఆదరణనిస్తాయి.


మత్తయి 26:23-49 లో యూదా యేసు ప్రభువును అప్పగించే సన్నివేశాన్ని చదివి నేనెంతో ఏడ్చాను. ఈ మధ్యే నా జీవితంలో కూడా ఇలాంటి ద్రోహన్నే నేను అనుభవించాను. ఈ సన్నివేశాన్ని చదవడం ద్వారా యేసు ప్రభువు అనుభవించిన ఆ బాధ ఎంతటిదో కొద్దిగా అర్ధం చేసుకోగలిగాను.


ఆయన మన బాధను కూడా అర్ధం చేసుకుంటారు. దీనిని మనం తెలుసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం.


• నీ స్నేహితులకు కుటుంబసభ్యలకు నువ్వు ఎంత సహాయం చేసినా, నీ అవసరతలో వారు నిన్ను ఒంటరిని చేశారా? శిష్యులు కూడా ఇదే చేశారు మన యేసు ప్రభువుకు (మత్తయి 26:38-46;55-56). కనుక నీ బాధను ఆయన అర్ధంచేసుకోగలరు.


• శారీరికంగా నీవు వేధించబడ్డావా? వారు యేసు ప్రభువుకు కూడా అలానే చేశారు (మత్తయి 27:26). కనుక నీ బాధను ఆయన అర్ధంచేసుకోగలరు.


• నీవు వెక్కిరించబడ్డావా? యేసు ప్రభువు మరణం పొందేటంత దెబ్బలు తింటున్నపుడు వారు కూడా ఆయన్ని వెక్కిరించారు (మత్తయి 27:27-31). కనుక నీ బాధను ఆయన అర్ధంచేసుకోగలరు.


• నీవు చేయని నేరానికి నిందించబడ్డావా? యేసు ప్రభువు ఆ శ్రమను కూడా పొందారు (1 పేతురు 3:17-18). కనుక నీ బాధను ఆయన అర్ధంచేసుకోగలరు.


మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడుకాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. (హెబ్రీయులకు 4:15)


Jesus Understands Your Pain


నువ్వు తృణీకరించబడినపుడు, వెక్కిరించబడినపుడు, వేధించబడినపుడు, ఒంటరితనంలో ఉన్నపుడు.. యేసును గురించిన ఈ సత్యాలు నీకు ఎంతో ఆదరణనిస్తాయి.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.