అద్భుతమైన మాట

పాత నిబంధనలో అంతర్భాగంగా చెప్పబడినది కొత్త నిబంధనలో బయలుపరిచబడింది.. సిలువలో పలికిన ఆ మాటే మనందరి జీవితాలను మర్చివేసింది. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


"రానున్న విమోచకుని" గురించిన వార్త పాత నిబంధన గ్రంధంలో ఉన్న ప్రతీ పుస్తకంలో అంతర్భాగంగా దేవుడు వ్రాయించి ఉంచాడు. కాని నూతన నిబంధన గ్రంధంలో ముఖ్యంగా సువార్తలలో ఆ వార్తను స్పష్టంగా బయలుపరిచాడు. యేసు నిత్యత్వంలోనికి అరిచిన ఈ మాటకే దేవుడు మనలను సిద్దపరుస్తూ వచ్చారని అర్ధం చేసుకోవచ్చు. ఆ మాటే "సమాప్తమైనది" యోహాను 19:30.


ఈ మాటే ప్రపంచాన్ని మార్చివేసింది.


ఈ మాటే క్రీస్తును వెంబడించే ప్రతీ క్రైస్తవుని గమ్యాన్ని మార్చివేసింది.


మన రక్షకుడు మన పాపం యొక్క పూర్తి భారాన్ని భరించి, జయించారు అనేది ఈ మాట ద్వారానే మనం అర్ధంచేసుకోవచ్చు.


సమాప్తమైనది అనే మాట మూల భాషలో చూస్తే "పూర్తిగా చెల్లించబడింది" అనే అర్ధం వస్తుంది. ఈ మాట సరిగ్గా సరిపోయే మాట.


యేసు చెల్లించినది మన ఋణం కాని తనది కాదు అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు.


'మంచి శుక్రవారం' అని మనం ఆచరించే ఆ రోజు శ్రమ యొక్క భయంకర రూపమైతే అదే మన దేవాది దేవుని యొక్క అతి పవిత్రమైన ప్రేమకు చరిత్రలో నిలిచిపోయే చిహ్నం.


ప్రతీ రోజూ సవాళ్ళను ఎదుర్కునే సమయాల్లో మనందరి ఆలోచనలు, మాటలు, హృదయాలు సిలువపై యేసు పలికిన ఆ ఆఖరి మాటపై దృష్టిని నిలుపును గాక!


"సమాప్తమైనది"


మన పాపానికి పూర్తిగా వెల చెల్లించబడింది, హల్లెలూయా!


3 Incredible Words!


పాత నిబంధనలో అంతర్భాగంగా చెప్పబడినది కొత్త నిబంధనలో బయలుపరిచబడింది.. సిలువలో పలికిన ఆ మాటే మనందరి జీవితాలను మర్చివేసింది. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.