నాకు చాలా ఇష్టమైన శుక్రవారం

ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో మంచి శుక్రవారం గురించి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అవి మనలకు సవాలును స్ఫూర్తిని కలుగజేస్తాయి!

నాకు చాలా ఇష్టమైన శుక్రవారం మాటల్లో వర్ణించలేనంత బాధాకరమైన రోజు.


మానవజాతి యొక్క ఘోరమైన పాప స్థితిని అది బయలుపరుస్తుంది - నా పాపంతో సహా!


మానవజాతి - సత్యాన్ని, నిజమైన ప్రేమను, నీతిని, పరిశుద్దతను మంచి ఉద్దేశాన్ని చంపడానికి ఎంత వరకైనా వెళ్ళగలదు అనేది ఈరోజు బయలుపరిచింది. అలానే నేను కూడా నా పుట్టుక నుంచే దేవుని సత్యం నుండి తప్పించుకోవడం, నిరాకరించడం, తప్పుగా అర్ధం చేసుకోవడం అనే అంత స్థాయికి వెళ్లాను.


అయితే ఈ శుక్రవారం ఒక అద్భుతమైన, అమూల్యమైన, ఉద్దేశపూర్వకమైన, ఖచ్చితమైన, చాలా లోతైన శుక్రవారం కూడా.


అది మానవజాతిని పాపం నుండి మరణం నుండి తప్పించునే మార్గాన్ని తెలియజేసింది - నా పాపం నుండి మరణం నుండి కూడా.


ప్రేమమాయుడైన దేవుడు విచక్షణలేని, వికారమైన, దుష్టత్వం కలిగిన, ద్వేషించదగ్గ మానవజాతిని విడిపించడానికి ఎంత వరకైనా వెళ్తాడు అనేది ఈరోజు బయలుపరిచింది - ఆ మానవజాతిలో నేను కూడా ఉన్నాను.


చరిత్రలో ఈరోజుకు మంచి శుక్రవారం అనే పేరు పెట్టడం సరిపోయే పదం కాదేమో అని నా ఉద్దేశం.


ఎటువంటి నిర్వచనం ఈరోజును వర్ణించలేదు.


మరియు ఈరోజు తర్వాత ఆదివారం రాబోతుంది. ఆ ఆదివారానికి కూడా నేను అర్హురాలిని కాదు.


మనం ఒకరోజున యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూడబోతున్నాము అనేది ఈ ఆదివారం మనకు స్పష్టం చేసింది (1 కొరింథీ13:12).


ఆయన గాయాలు నిత్యత్వంలో ఎప్పటికీ చెరిగిపోని గురుతులుగా ఉంటాయి - ఆ గాయాలే నా ఆత్మ రక్షణకు కారణం (యోహాను 20:24-29).


ఈ శుక్రవారానికి నేను అర్హురాలిని కాను, కాని అది నా స్వంతం. ఈ శుక్రవారం నేను సంపాదించినది కాదు, ఆయన వరమే!

My Favorite Friday


ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో మంచి శుక్రవారం గురించి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అవి మనలకు సవాలును స్ఫూర్తిని కలుగజేస్తాయి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.