ఎవరి  ప్రశంస  వెతుకుతున్నాము?

బైబిల్ ప్రకారం స్వార్ధం గర్వం అనేవి ఎంత నాశనకరమైనవో ఈరోజు వాక్యధ్యానం ద్వారా తెలుసుకుందాం!

"వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారంగా, ల్యాండ్ ఎండ్ మరియు బ్యాంకు అఫ్ అమెరికా అనే సంస్థలు జెన్ వై డిమాండ్ ప్రకారం ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదల కోసం "ప్రశంసించే టీమ్" ను నియమించుకున్నారు. వేరే సంస్థలు వారిని ఉద్యోగంలోనుండి తీసివేయకుండా ఉంటే చాలు, పని బానే చేసుకుంటాము అనుకున్నా.. జెన్ వై కు మాత్రం నిరంతర ప్రశంసలు కావాలి" (Aspen Ed &WSJ)


దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండాలి అనే దాన్ని పక్కన పెట్టి, ఎవరికి వారే నేనే గొప్ప వ్యక్తిని నేనే మంచి వ్యక్తిని అని భావించే రోజుల్లో మనం జీవిస్తున్నాము. ఈ స్వార్ధం అనేది సంఘంలోని ప్రాధాన్యతలను కూడా ప్రభావితం చేస్తుంది.


దేవుని రాజ్యాన్ని వెతకడం బదులు, మన స్వంత మహిమను వెతుకుతూ చాలా బిజీగా జీవిస్తున్నాము.


మనం మన దేవుణ్ణి సంతోపెట్టడం పై ఆసక్తి కలిగి ఉన్నామా లేక మనలను మనమే సంతోషపెట్టుకోవడం పై ఆసక్తి కలిగి ఉన్నామా?


కేవలం భాతికమైన వాటిపై అత్యాశ మాత్రమే మనలను నాశనం చేయదు.. కాని... అందరి మెప్పు పొందాలని లేక అందరిలో ముఖ్యమైన వారిమి అనిపించుకోవాలనే ఆ అత్యాశ కూడా మనలను ఖచ్చితంగా నాశనం చేస్తుంది.


మనం అనుకరించవలసిన  సరైన వైఖరి పౌలుకు ఉంది :

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. (ఫిలిప్పీయులకు 3:8)

Whose Praise Are We Seeking?


బైబిల్ ప్రకారం స్వార్ధం గర్వం అనేవి ఎంత నాశనకరమైనవో ఈరోజు వాక్యధ్యానం ద్వారా తెలుసుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.