1967 లో ఈతకొడుతున్నప్పుడు జరిగిన ప్రమాదం...
ఒకరోజున జోని చురుకైన యవ్వనస్తురాలు, తరువాత రోజులోనే తన ముక్కును కూడా తాను తుడుచుకోలేని చతుర్బజం (రెండు చేతులు, రెండు కాళ్ళు పక్షవాతము) పొందిన వ్యక్తి.
అయితే గత యాభై ఏళ్లుగా జోని ఆ చెక్రాలబండి నుండే అనేకమంది ఆరోగ్యవంతులకు వికలాంగులకు గొప్ప ఆదరణను స్థైర్యాన్నీ ఇస్తూ ఉన్నతమైన సేవ చేస్తుంది.
గత ఇరువై సంవత్సరాలలో తాను తట్టుకోలేనంత తీవ్రమైన నొప్పిని భరించడమే కాకుండా రెండుసార్లు కాన్సర్ రావడం దానికోసం చాలా కఠినమైన చికిత్స పొందడం జరిగింది.
జోని యొక్క జీవితం, నేను నాకున్న సమస్యలను ఇంకో కోణంలోనుండి చూసేలా సహాయపడింది.. ఆమెకున్న ఆశ్చర్యకరమైన విశ్వాసం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అనడంలో సందేహమే లేదు.
జోని :
నా బాధ నా నిరీక్షణను విస్తరింపజేసింది, క్రీస్తును ఇంకా ఎక్కువగా తెలుసుకునేలా చేసింది, సత్యాన్ని తెలుసుకోవాలనే తపనను పెంచింది, నా పాపాలను ఒప్పుకునేలాగ చేసింది, వేదనలలో కూడా స్తుతించడానికి ప్రేరేపించింది, నా విశ్వాసాన్ని పెంచింది, నా స్వభావాన్ని మెరుగుపరిచింది. ఈ చెక్రాలబండి జీవితం నాకు దేవుడిని ఎక్కువగా తెలుసుకోవడంతో, ప్రతీరోజూ ఆయనయందు ఆనందించడంతో సమానం. ఒకవేళ ఇది నీ పుస్తకంలో రాయడానికి ఒక అద్భుతంగా అర్హత పొందలేకపోతే... ఎంతో వినయంతో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను.. నేనైతే నీ పుస్తకాని కంటే నా పుస్తకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.
మన పరిస్థితులు ఎంత గాడాంధకారంతో బాధ వేదనలతో ఉన్నా మనం సేవించే మన దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటూ మనలను తన వెలుగులోనికి గొప్ప నిరీక్షణలోనికి నడిపిస్తాడు. (రోమీయులకు 8:28; రోమీయులకు 8:38-39).
దయచేసి జోని కోసం కొన్ని నిమిషాలు ప్ర్రార్ధన చేసి.. నీ సమస్యలను కూడా ఇంకో కోణంలోనుండి చూడటానికి ప్రయత్నించు!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.