గొప్ప సాక్షి-సమూహపు స్వరాలు

నిరుత్సాహపరిచే ఎన్నో స్వరాలు ఆధునిక క్రైస్తవ్యంలో రోజూ వింటుంటాము. కాని ఈరోజు వాక్యధ్యానంలో ప్రోత్సాహించే స్వరాలను విందాం. అవి మనలను ప్రేమచూపుటలోనికి, సత్క్రియలలోనికి ప్రేరేపించును గాక!


తమ విశ్వాసాన్ని విడిచిపెట్టిన ఒకప్పటి క్రైస్తవుల యొక్క స్వరాలు వింటే మనకు ఎంతో నిరుత్సాహం కలుగుతుంది. కాని అవి దేవునిలో మనకున్న విశ్వాసాన్ని, సంతోషాన్ని ప్రభావితం చేయనివ్వకూడదు.


వాటిని బదులు మనలను ప్రోత్సాహించే "ఆ గొప్ప సాక్షి సమూహపు స్వరాలు" వినాలి (హెబ్రీయులకు 12:1). వారు దేవుడిని ఎంతో విశ్వాసించారు, దేవుని కోసం ఎంతో వదులుకున్నారు, దేవుని వాక్యాన్ని ఎంతో గట్టిగా హత్తుకోని చాలా శ్రమలను సహించారు.


మనం కూడా వారు చేసినట్టే చేయగలిగేలా వారి స్వరాలు మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి.


వారికి వచ్చే ప్రతీ కష్టమైన ప్రశ్నకు వారికి జవాబు అవసరం లేనే లేదు ఎందుకంటే వారు దేవుని మంచితనాన్ని నమ్ముకున్నారు కాబట్టి. వారికి అందరి ఆమోదం కూడా అవసరం లేదు ఎందుకంటే వారు మనుషుల కంటే దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నారు గనుక.


ఇతరులు తమ విశ్వాసం నుండి తొలగిపోయినా వీరు మాత్రం నిలబడటానికే ఇష్టపడ్డారు. ఇతరులు సులువైన మార్గాలు ఎంచుకున్నా వీరు మాత్రం తాము నమ్మిన దేవుని కోసం యాతనపెట్టబడటానికి కూడా వెనకాడలేదు.


అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని దేవుడు చెప్తున్నాడు (హెబ్రీయులకు 11:38).


ఈ వారం అలాంటి మంచి క్రైస్తవ జీవిత చరిత్రలు సేకరించి.. వారి స్వరాలను వినడానికి నీవు కొంత సమయాన్ని ఎందుకు కేటాయించకూడదు?


Voices from the Great Cloud of Witnesses


నిరుత్సాహపరిచే ఎన్నో స్వరాలు ఆధునిక క్రైస్తవ్యంలో రోజూ వింటుంటాము. కాని ఈరోజు వాక్యధ్యానంలో ప్రోత్సాహించే స్వరాలను విందాం. అవి మనలను ప్రేమచూపుటలోనికి, సత్క్రియలలోనికి ప్రేరేపించును గాక!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.