నిరత్సాహాన్ని జయించే అయిదు మార్గాలు

నిరత్సాహాన్ని జయించే అయిదు మార్గాలను దైవవాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందామా!


నిరత్సాహాన్ని జయించే అయిదు మార్గాలు:


1. 'నా సమస్యల నుండి విడుదల పొందితేనే నాకు ఆదరణ లభిస్తుంది' అనే ఆలోచనను నమ్మవద్దు. నీ సమస్యల మధ్యలోనే దేవుడు నిన్ను ఆదరించగలరు (యోహాను 16:33)


2. ఏ స్నేహితుడు/స్నేహితురాలు అయితే నీ దృక్పధాన్ని మార్చి, దేవుడు నమ్మకమైనవాడు అని నీకు గుర్తుచేసి నిన్ను దృఢపరచగలరు అని నీకు నమ్మకం ఉందో ఆ వ్యక్తితో నీ సమస్యను పంచుకో (గలతీ 6:2)


3. నీ సమస్యపై నుండి దృష్టిని తొలగించుకోని, కష్టంలో ఉన్న ఎవరినైనా ప్రోత్సాహపరిచే మార్గాలు గురించి ఆలోచించు (ఫిలిప్పీ 2:3,4)


4. నువ్వు దేవుని సహాయంతో దేనినైనా ఎదుర్కోగలవు అనే విషయం గుర్తుపెట్టుకో (ఫిలిప్పీ 4:13)


5. దేవుడు నీకు చేసిన మేలులన్నిటిని ఉద్దేశపూర్వకంగా తలచుకోవటానికి సమయం కేటాయించు. నీ ఆశీర్వాదాలు లెక్కించు, వాటిని వ్రాసుకోని, రోజులో అనేకసార్లు పైకి గట్టిగా వాటిని చదువుకో, ఆ వ్రాసుకున్నదాన్ని నీకు కనపడేలాగ ఒక చోట తగిలించు (1 థెస్సలోనిక 5:18)


తృణీకరించబడినపుడు, ప్రేమించేవారు లేనపుడు, ఎవరికి చెప్పుకోవాలో తెలీనపుడు, అనేక ప్రశ్నలు భయాలతో ఉన్నపుడు కీర్తనకారుడు కీర్తన 77:11-12లో ఈ విధంగా వ్రాసాడు :


యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.


దేవుని నమ్మకత్వాన్ని ధ్యానించిన ప్రతీసారి తప్పక సహాయం పొందుతాం.. దీనిలో సందేహమే లేదు!


5 Ways to Deal With Discouragement



నిరత్సాహాన్ని జయించే అయిదు మార్గాలను దైవవాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందామా!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.