నాలాంటి పనికిరాని చెత్తను యేసు రక్షించాడు

చెత్తలోనుండి వస్తువులను తీసి వాటిని తిరిగి ఉపయోగకరంగా మార్చడమంటే నాకు చాలా ఇష్టం. దేవునికి కూడా అది ఇష్టం అనడానికి ఋజువు నేనే. ఈ నా మాటలు, ఎవరికి వారే గొప్పవారిగా ఎంచుకోవాలి అనే బోధలను ఇష్టపడేవారికి నచ్చకపోవచ్చు. కాని నేను మాత్రం నేను ఒకప్పటి చెత్తనే అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను.
దేవుడు మన జీవితాలను ఆయన మహిమ కొరకు తిరిగి ఉపయోగకరముగా మార్చగలరు....


హంగేరియన్లు, అక్కడ ప్రజలు ఎప్పుడైతే వారి ఇంటిని శుభ్రం చేసుకోవడానికి వాళ్ళు వాడేసి పాడైపోయిన వస్తువులను పెద్దమొత్తంలో ఒక చోట వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారో వాటిని సేకరిస్తుంటారు.


మేము బ్యూడాపెస్టులో ఉన్నపుడు ఇలా "చెత్తను సేకరించిపెట్టే రోజు" కోసం నేను సంతోషంతో ఎదురుచూసేదాన్ని.


అద్భుతమైన నిధులను వాటిల్లో నేను కనుగొని, అవి తిరిగి ఉపయోగకరంగా మార్చి, నా గృహంలో వాటిని పెట్టుకునేదాన్ని. చెత్తను సేకరించడం మీకు అసహ్యమైనదిగా అనిపించినా, నాకు మాత్రం అవి చాలా ఇష్టం. చెత్తలో నేను చూడలేని అందాలను నువ్వు చూడగలవు అని నా భర్త అంటుంటారు.


మన ప్రభువుకు కూడా ఇలా చెత్తను సేకరించడం చాలా ఇష్టం. ఆయన నన్ను కూడా అపనమ్మకం అనే చెత్తకుప్పనుండి ఏరి.. నేను ఎన్నడూ ఊహించని విధంగా తిరిగి నా జీవితాన్ని ఉపయోగకరంగా మార్చాడు.


ఎవరికివారే గొప్పవారు అనుకునే ఈ రోజుల్లో, రోమీయులకు 3:12 (అందరును త్రోవ తప్పి యేకముగా "పనికిమాలినవారైరి".) చదువుకోవడం అంత ప్రసిద్ధమైనది కాకపోయినా.. ఆ వాక్యం నాలో గొప్ప సంతోషాన్ని నింపుతుంది. నా ప్రభువు నాకోసం తన దైవిక మహిమను విడిచిపెట్టి, దాసుని స్వరూపమును ధరించే అంతగా తగ్గించుకోని, ఒక నేరస్తుడు పొందే తీర్పును, ఘోరమైన సిలువ మరణాన్ని పొందాడు. ఇదంతా ఏ యోగ్యతా లేని చెత్త కుప్పవంటి జీవితాన్ని కలిగిన నన్ను నరకం నుండి రక్షించడం కోసం (ఫిలిప్పీ 2:6-8)


యేసుక్రీస్తు నా హృదయాన్ని, నా జీవిత ఆశయాలను మార్చక ముందు నేను ఏ స్థితిలో ఉండేదాన్నో గుర్తుచేసుకోవడానికి నేను అస్సలు సిగ్గుపడను (ఎఫెసీ 2:10)


గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండును. (2 తిమోతికి 2:20,21)


నన్ను రక్షించిన ప్రభువా నీకు నా హృదయపూర్వక కృతఙ్ఞతాస్తుతులు!


Jesus Rescues Junk Like Me


చెత్తలోనుండి వస్తువులను తీసి వాటిని తిరిగి ఉపయోగకరంగా మార్చడమంటే నాకు చాలా ఇష్టం. దేవునికి కూడా అది ఇష్టం అనడానికి ఋజువు నేనే. ఈ నా మాటలు, ఎవరికి వారే గొప్పవారిగా ఎంచుకోవాలి అనే బోధలను ఇష్టపడేవారికి నచ్చకపోవచ్చు. కాని నేను మాత్రం నేను ఒకప్పటి చెత్తనే అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.