నిర్ణయం నాకు వదిలేస్తే నేనైతే సులువైన జీవితాన్నే కోరుకుంటాను.
ఒకవేళ నాకు సులువైన జీవితం ఉంటే నేను ఎప్పటికీ ఓర్పు కలిగి ఉండటాన్ని నేర్చుకోలేను. ఇంక దేవుడు నాకు ఎంత ఎక్కువ అవసరమో అది కూడా నేను ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేను. (1)
అందుకే 'దేవా ! నీకు కావాల్సిందే నేను కూడా కోరుకోవాలి' అనే ప్రార్ధన చేస్తుంటాను.
దానికి ఈ క్రింది సత్యాలు నాకు సహాయపడతాయి :
1. అసాధ్యాలు కూడా దేవుడు సాధ్యం చేయగలడు - ఆయన మన కఠినమైన పరిస్థితులను కూడా మన మంచికి ఉపయోగించగలడు (రోమీయులకు 8:28)
2. భూసంబంధమైన జీవితం లోపము కలిగినది, కాని పరలోకమే మన భవిష్యత్తు !
"లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను ~ యేసు". (యోహాను 16:33)
3. యేసు ప్రభువు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు (హెబ్రీయులకు 13:5-6)
4. ఆయన అందరిని మించిన గొప్ప ఆదరణకర్త (2 కొరింధీయులకు 1:3-5)
5. ఆయన తన ప్రణాళికలకు నేను సహకరించేలాగ నాకు నేర్పించగలరు - ఆయనకు కావాల్సింది నేను కూడా కోరుకునేలాగా ఆయన చేయగలరు (ఫిలిప్పీయులకు 2:12-13).
ప్రియమైన యేసయ్య, నీకు నా కృతజ్ఞతలు !
--------------------
(1) గమనిక : పౌలు సూత్ర నిర్ధారణ 2 కొరింధీయులకు 1:8-9
Help Me Want to Want What You Want, Lord
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.