చెత్తను భరించడం


చెత్త మన మెదడుని ప్రభావితం చేస్తుందని నీకు తెలుసా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


నీకు తెలుసా మనందరికీ చెత్తను భరించే విషయంలో రకరకాల స్థాయిలు ఉంటాయని?


చెత్తను సేకరిస్తూ ఉంటే, ఒక స్థాయికి చేరాక మనము చాలా ఒత్తిడికి లోనౌతాము. అంతమాత్రమే కాకుండా దానివల్ల ఫలించే సామర్థ్యాన్ని కూడా మనం కోల్పోతాము అని నిపుణులు చెప్తుంటారు. చెత్త మన మెదడుకు తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తున్నప్పటికీ, అవసరం లేని ఎన్నో వస్తువులను చెత్తలా పోగుచేస్తూనే ఉంటాము.


నేను కూడా అలా పోగుచేసుకునే వ్యక్తినే అని ఒప్పుకుంటున్నాను. కాబట్టి నేను నిన్ను తప్పుపడుతున్నానని అనుకోకు. కాని దీని గురించే ఈమధ్య నన్ను నేనే కొన్ని ప్రశ్నలు వేసుకుంటున్నాను.


అవి:


ఇంత చెత్తను (వస్తువులను) నేను పోగుచేయకపోతే నా జీవితం ఇంకా దైవికంగా, ఫలాభరితంగా ఉండేదా?


నేను వస్తువులను కలిగి ఉన్నానా లేక వస్తువులు నన్ను కలిగి ఉన్నాయా?


యేసు ఒక యౌవన అధికారితో అన్న మాటల భావాన్ని త్వరగా నీకు వివరిస్తాను. నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మని యేసు అతనితో చెప్పినప్పటికినీ, అది అందరి విషయంలో దేవుని చిత్తం కాదని నాకు తెలుసు.


కాని యేసు లూకా 12:15 లో చెప్పిన మాటలను నేను పూర్తిగా గ్రహించగాలిగాను "మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను". (లూకా 12:15)


నేనైతే పరలోకపు ధనాన్ని మాత్రమే కూర్చుకోవాలని నిర్ధారించుకున్నాను, ఎందుకంటే "నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును". (మత్తయి 6:19-21)


మరి నీ సంగతి ఏమిటి?


Clutter Tolerance


చెత్త మన మెదడుని ప్రభావితం చేస్తుందని నీకు తెలుసా? ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!





No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.