అనుభూతి లేనప్పుడు


మన భావోద్రేకాలు, అనుభూతులు నమ్మదగినవికావని, అలానే దేవునితో మన సమయం చాలా ప్రాముఖ్యమని ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందామా!



అనుభూతి లేనప్పుడు వాక్యం చదవడం, ప్రార్ధించడం విడిచిపెట్టేయాలి.. అని అనిపించే శోధన సాతాను నుండి ప్రతీ ఒక్కరికి సాధారణంగా కలిగేది...ఏదో అలా అనుభూతి లేకపోతే వాక్యాన్ని చదవడం వల్ల ఏమీ ప్రయోజనం లేనట్టు.. - జార్జ్ ముల్లర్



కొన్నిసార్లు రోజువారీ పనులు కూడా పక్కన పెట్టేసి మరీ వాక్యంలో ఉన్న ఆ జ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలని ఎంతో ఆత్రుతతో వాక్యం చదువుకోవడానికి సమయం చేసుకుంటాను. అప్పుడు నేను సేద తీర్చబడి, పునరుద్ధరణ పొందుతాను.


ఇంకొన్నిసార్లు, అంత ఉత్సాహం, ఆసక్తి అనిపించదు.. వాక్యం చదివాక అంత స్పర్శించబడిన అనుభూతి పొందను.


కాని దేవుని వాక్యమే నమ్మదగినది, నా 'అనుభూతులు' కావు.


దేవుడు తన వాక్యాన్ని వర్షంతో పోల్చాడు. అది భూమిని తడిపి ఏ విధంగా వృద్ధిని కలిగిస్తుందో అలానే ఆయన వాక్కు కూడా ఆయన పంపిన ఉద్దేశాన్ని సఫలం చేస్తుందని ఆయనే మనకు భరోసా ఇస్తున్నాడు (యెషయా 55:10-11).


నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును. (యెషయా 55:11)


కనుక మనకు 'అనుభూతి' ఉన్నా లేకపోయినా, మన సమయాన్ని ఖర్చుపెట్టాల్సినంత అర్హత ఉన్నది కేవలం దేవుని వాక్యానికే.. ఎల్లప్పుడు!


When the Feelings Aren't There


మన భావోద్రేకాలు, అనుభూతులు నమ్మదగినవికావని, అలానే దేవునితో మన సమయం చాలా ప్రాముఖ్యమని ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందామా!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.