యోసేపు ఎన్నో ఘోరమైన పరిస్థితులను అధిగమించాడని లేఖనాలలో వ్రాయబడింది :
✝️తన సొంత అన్నలే తనను బానిసగా అమ్మివేసినా, క్షమించాడు (ఆదికాండము 50:15-21)
✝️ఒక చెడ్డ స్త్రీ చేత తప్పుగా నిందించబడి చెరసాలలో పడవేయబడినా, సహించాడు (ఆదికాండము 39:1-21)
'నేను ఇంక భరించలేను ప్రభువా' అని యోసేపు ఎప్పుడైనా చెప్పి ఉంటాడా? దేవుడిని వదిలేయాలి అని తనకి ఎపుడైనా అనిపించిందా?
లేఖనాలలో ఈ వివరాలు ఏమీ వ్రాయబడలేదు కాని యోసేపు కూడా మనవంటి మనుష్యుడే కనుక అలాంటి సంఘర్షణలు తనలో కూడా కలిగే ఉండొచ్చు.
కాని యోసేపు జీవితంలో ఒక అద్భుతమైన సందేశం దాగివుంది.. అదేమిటంటే యోసేపు దేవుణ్ణి దేవునిగా ఉండనిచ్చాడు:
✝️రాజు చేత ప్రశంశించబడినప్పుడు.. ఆ కీర్తి తన దేవునికే ఇచ్చాడు.
యోసేపు నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. (ఆదికాండము 41:14-16)
✝️తన అన్నలమీద ప్రతీకారం తీర్చుకునే స్థానంలో ఉన్నా కూడా
భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? (ఆదికాండము 50:19) అని చెప్పాడు.
తను ఎంతో శ్రమను అనుభవించాడు. ఎంతో ఓర్చుకున్నాడు. రాజుల ఎదుట మాట్లాడే విషయంలో గాని, పాపాత్ములైన తన కుటుంబసభ్యులను ఓదార్చే విషయంలో గాని దేవుణ్ణి దేవునిగా ఉండనిచ్చే అంతగా దేవుడిని నమ్మాడు.
మనం కూడా యోసేపు చేసినట్టే చేద్దామా?
Joseph Let God Be God - Genesis 50:19
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.