క్రైస్తవులు నమ్మే కొన్ని అబద్దాలు - వాక్యభాగంలో కేంద్రము 'నేనే'

139 వ కీర్తన చాలా ముఖ్యమైన సందేశాన్ని నొక్కిచెప్తుంది, కాని కొన్నిసార్లు ఆ సందేశాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటాం!


139 వ కీర్తన దేవుణ్ణి హెచ్చించింది కాని, మానవుణ్ణి కాదు...


దేవుని వాక్యం ద్వారా మనం ప్రోత్సాహాన్ని పొందాలి. కాని, మనం జాగ్రత్త తీసుకోకపోతే, తప్పిపోయే ప్రమాదం ఉంది.


ఉదాహరణకు, 139 వ కీర్తన. 'నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి' అనే దానిని మానవులకు నివాళిగా ఒకరు నొక్కి చెప్పడం నేను విన్నాను.


కాని వాస్తవంగా 139వ కీర్తన దేవునికి నివాళి గాని మనకు కాదు. మనం ఆశ్చర్యకరంగా సృష్టించబడ్డాం ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరమైన సృష్టికర్త కనుక. 139వ కీర్తన దేనిగురించి అంటే రూపకల్పన చేయగలిగే ఆయన అద్భుతమైన సామర్ధ్యం, మన జీవితాలలో ఉన్న ప్రతీ ఒక్క చిన్న వివరాలలో ఆయనకున్న అద్భుతమైన నమ్మశక్యం కాని జ్ఞానం గురించి.


మన గురి మన సృష్టికర్తపై కాక, మనపై లేక సృష్టింపబడిన మరి దేనిపైన అయినా పెడితే, రోమీయులకు 1:25 ప్రకారం విగ్రహారాధన వైపుగా మనం అడుగులు వేస్తున్నాం అని అర్ధం :

అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌.


మనం ఎపుడైతే దేవునిపై గురిని నిలుపుతామో, విశేషమైనరీతిలో మనపై మనకు ఆరోగ్యకరమైన దృష్టి కలుగుతుంది (రోమీయులకు 12:3), అలానే ఇతరులపై ఎక్కువ దృష్టి నిలుపగలుగుతాము (ఫిలిప్పీయులకు 2:3-7).


మనపై మన గురి మన ఆత్మలను కుంచించుకుపోయేలా చేస్తుంది కాని దేవునిపై ఇతరులపై మన గురి మన ఆత్మలను వికసింపచేస్తుంది!


Lies Some Christians Believe - The Focus of Scripture is Me



139 వ కీర్తన చాలా ముఖ్యమైన సందేశాన్ని నొక్కిచెప్తుంది, కాని కొన్నిసార్లు ఆ సందేశాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటాం!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.