తోటి విశ్వాసులు మనకు నచ్చనప్పుడు

ఎలిజబెత్ ఎలియట్, రేచేల్ సెయింట్ ల జీవిత కధ, తోటి విశ్వాసులు ఒకరినొకరు 'ఇష్టపడనప్పుడు' అనే జీవితంలో జరిగే వాస్తవ సంఘటనలకు సంబంధించి ఆసక్తికరమైన సూత్రాలను మనకు అందించారు.


విశ్వాసుల మధ్య బేధాభిప్రాయాలు సంఘర్షణలు కలిగినపుడు, అయోమయంగా ఎప్పుడైనా అనిపించిందా? వారి అభిప్రాయాలు కలిసిపోవాలి కదా?


వాక్యంలోని మూల సూత్రాలవల్ల మన సంబంధాలు మెరుగుపడతాయి అనేది నిజమే అయినా, మనం లోపం కలిగిన మనుషులమే.


పౌలు బర్నాబాలు దేవుని చేతిలో వాడబడే శక్తివంతమైన సేవకులే అయినప్పటికీ, వారిమధ్య చాలా తీవ్రమైన బేధాభిప్రాయాలు కలిగి, ఇద్దరూ చెరొక మార్గాలలోనికి వెళ్లిపోయారు (అపో. కార్యములు 15:36-41)


నేను ఈ మధ్యే ఎలిజబెత్ ఎలియట్, రేచేల్ సెయింట్ గురించి చదివాను. వీరు కూడా దేవుని చేతిలో వాడబడే శక్తివంతమైన సేవకులే అయినప్పటికీ, వారు కూడా చెరొక మార్గాలలోనికి వెళ్లిపోయారు.


చాలా మంది గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు చదివినపుడు ఇలాంటివి వారికి కూడా జరగడం మనం గమనించగలం.


మనం ప్రతీ ఒక్క క్రైస్తవుని సహజంగా ఏమీ ఇష్టపడము, వారితో కలిసి పనిచేయడం కూడా కఠినంగానే ఉంటుంది.


కాని దేవుడు అందరినీ ఇష్టపడాలని మనకి చెప్పలేదు లేక అందరితో కలిసి పనిచేయడం ఇష్టంగా ఉండాలనీ చెప్పలేదు. దేవుడు అడిగేది ఏమిటంటే :


సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. (ఎఫెసీయులకు 4:31,32)


When We Don't Really "Like" Fellow Believers


ఎలిజబెత్ ఎలియట్, రేచేల్ సెయింట్ ల జీవిత కధ, తోటి విశ్వాసులు ఒకరినొకరు 'ఇష్టపడనప్పుడు' అనే జీవితంలో జరిగే వాస్తవ సంఘటనలకు సంబంధించి ఆసక్తికరమైన సూత్రాలను మనకు అందించారు.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.