నీకు పాడైపోయే ఆహారం కావాలా?

కొంతమంది తప్పుడు కారణాలతో తనను వెంబడించారని యేసు చెప్పారు. ఈరోజుల్లో కూడా కొందరు అదే చేస్తున్నారు. ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!💜


యేసు ప్రభువు అయిదు వేలమందికి ఆహారాన్ని పంచి పెట్టినప్పుడు, వారు చాలా ఆసక్తితో ఆయన్ని వెంబడించారు. కాని సరైన కారణంతో మాత్రం కాదు :


యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. (యోహాను 6:26,27)


యేసు చేసిన సూచక క్రియలు, మహాత్కార్యాలు, ఆయన బోధలో భాగాలు, ఆయనే రక్షకుడు అని వాటి ద్వారా నిరూపించడానికి. కాని యేసు తన్ను వెంబడించే వారికి ఉచిత ఆహారం ఇవ్వబడుతుంది అని ఎక్కడా వాగ్దానం చేయలేదు. అక్షయమైన జీవాహారాన్నే ఆయన వాగ్దానం చేశారు.


అదేవిధంగా యేసు కొన్నిసార్లు జనులను స్వస్థపరిచారు, ఆర్ధికంగా కూడా అద్భుతాలు చేశారు, కాని అవి వాగ్దానాలు కావు.


• నమ్మకస్తుడైన తిమోతి ఆరోగ్య సమస్యలతో శ్రమపడ్డాడు, కాని తను ఆత్మీయంగా ఆరోగ్యవంతుడు.


• నమ్మకస్తుడైన పౌలు కొన్నిసార్లు ఆకలితో ఉన్నాడు, కాని ఆత్మీయ ఆహారంతో ఎల్లప్పుడూ తృప్తిపరచపడ్డాడు.


యేసు ప్రభువు ఆత్మీయంగా వర్ధిల్లడం గురించి వాగ్దానం చేశారు. దానికోసం ఈలోకంలో కఠినమైన సమస్యలు ఎదుర్కోవలసిందే (యోహాను 16:33). కాని ఆ సమస్యలే నిత్యత్వంలోనికి చేరేవరకు మనకు సత్తువను ఇచ్చే ఆహారంగా ఉపయోగపడతాయి. (1 పేతురు 1:6-9)


నువ్వు క్రీస్తును ఎందుకు వెంబడిస్తున్నావు?


Why are you following Christ?


కొంతమంది తప్పుడు కారణాలతో తనను వెంబడించారని యేసు చెప్పారు. ఈరోజుల్లో కూడా కొందరు అదే చేస్తున్నారు. ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!💜


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.