తక్కువ విరాళమే శ్రేష్టమైనది అని నిజంగా యేసు చెప్పారా?

ఎక్కువ విరాళం కంటే తక్కువ శ్రేష్ఠమైనది అని యేసు ఎందుకు చెప్పారు. లూకా 21 లో యేసు వివరించిన చాలా ప్రాముఖ్యమైన సూత్రాన్ని ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


లూకా 21:1-4 లో దేవుని ఆలయంలో ఉండే కానుకల పెట్టెలో అక్కడి ప్రజలు చెందా వేయడం యేసు గమనిస్తూ... వారిలో ఓ బీద విధవరాలు వేసిన రెండు నాణాలు అందరికంటే శ్రేష్ఠమైనది అని యేసు చెప్పారు.


ఎందుకని?

ఎందుకంటే ఆమె బీదరాలు.. ఆమె తనకున్నాదంతా ఇచ్చేస్తే, మిగతా వాళ్ళు వారికున్న సమృద్ధిలో నుండి కొంచెం ఇచ్చారు.


ధారాళముగా ఇవ్వడానికి గొప్పవారై ఉండనక్కర్లేదు.. పిసినారిగా ఉండటానికి బీదవారే అయి ఉండక్కర్లేదు. ఔదార్యము, పిసినితనము అనేవి హృదయంలో నుండి వచ్చేవే గాని, మన దగ్గర ఉన్న డబ్బును బట్టి వచ్చేవి కావు.


యేసు కూడా మనం ఎంత ఇచ్చేమో దానిని బట్టి తీర్పు తీర్చరు గాని, ఎంత దాచుకున్నామో దానిని బట్టి తీర్పు తీరుస్తారు.


ఔదార్యము గలవారు :


1. అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు - ఉదా : ఆలయానికి విరాళాలు (నిర్గమకాండము 36:1-7)


2. ఇతరుల అవసరాలకు స్పందిస్తారు - ఉదా : యెరూషలేము విశ్వాసులు (2 కొరింధీయులకు 8:9)


3. డబ్బుల కంటే ఎక్కువే ఇస్తారు - ఉదా : మంచి సమరయుడు (లూకా 10:25-37)


4. అర్హతలేనివారికి ఔదార్యం చూపుతారు - ఉదా : యోసేపు తన అన్నలకు (ఆదికాండము 50:19-21; లూకా 6:35).


5. వారు ఇచ్చిన దానిని దేవుడు వాడుకుంటాడు అని నమ్ముతారు - ఉదా : రొట్టెలు చేపలు ఉన్న చిన్న వాడు (యోహాను 6:5-13).


Did Jesus Really Say It’s Better to Give God a Small Donation?


ఎక్కువ విరాళం కంటే తక్కువ శ్రేష్ఠమైనది అని యేసు ఎందుకు చెప్పారు. లూకా 21 లో యేసు వివరించిన చాలా ప్రాముఖ్యమైన సూత్రాన్ని ఒక్క నిమిషం లో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.