క్రైస్తవులు అసంపూర్ణలు, మనమందరం కూడా.
కాని చరిత్ర అంతటిలో చూస్తే (ప్రస్తుతం కూడా) ఇతర నామకార్ధ బలహీన విశ్వాసులకు భిన్నంగా యాదార్థమైన విశ్వాస శేషం ఎప్పుడు ఉంటూనే ఉంటారు. వీరు ఓర్పు కలిగి, దేవునియందు ఆయన వాక్యం యందు నమ్మకాన్ని పెట్టుకున్నవారు. వీరి సేవ లోపం లేనిది కాదు గాని, వీరు దేవుని బాగా సేవించారు.
ఈ దేవుని శేషం, మన సమాజం ఎటు వెళ్తుందో అటు వైపుగా వొంగిపోరు. కాని వీరు :
1. దేవుని ఆజ్ఞలు వారికి ఆశీర్వాదకరమైమవి, కాపుదల ఇచ్చేవి కాని భారమైనవి కావు అని అంగీకరించినవారు (1 యోహాను 5:3).
2. వారి స్వార్ధకోరికలకు తగ్గట్టుగా దైవ వాక్యాన్ని కత్తిరించి అతికించడాన్ని తిరస్కరించి, సువార్తలోని కఠినమైన వాటిని కూడా అంగీకారించినవారు.
3. ఈ జీవితంలో వారికి పూర్తి ప్రతిఫలం దొరకకపోయినా, వారి విశ్వాసాన్ని కాపాడుకుంటున్న వారు (హెబ్రీయులకు 11:13-16)
మన సంఘాలు పూర్తిగా నిండిపోయి ఉండవచ్చు, కాని వారు పూర్తిగా ఈ శేషమైన క్రైస్తవులు కారు.
వారు రకరకాల ప్రజలు :
1. నకిలీలు - మత్తయి 13:24-30, 2 తిమోతి 3:1-5
2. లోకానుశారమైన క్రైస్తవులు - 1 కొరింధీయులకు 3:10-15
3. దేవుని శేష ప్రజలు - మత్తయి 7:21-27
నువ్వు వీరిలో ఎవరిలా ఉన్నావు? ఎవరిలా ఉండాలని కోరుకుంటున్నావు?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.