లిస్ట్ పెట్టుకోవడం వలన నేను అన్నిటిని క్రమంగా చేసుకోగలను. కాని అన్ని లిస్టులు ఆరోగ్యకరమైనవి కావు.
ఉదాహరణకు: ఇతరుల తప్పుల జాబితాలు, చేదైన జ్ఞాపకాలు, ఎప్పుడో జరిగిపోయిన ఇతరుల నేరాలు లేక అవమానాలు వంటివి.
కొంతమంది చాలా సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఇతరుల నేరాలనే లిస్టులను జాగ్రత్తగా దాచుకుంటారు. ఇంకొంతమందైతే చాలా సులభంగా చూసి చూడనట్టు వదిలేయగలిగే చిన్న తప్పులను కూడా వదలకుండా ఆ లిస్టులను కూడా జాగ్రత్తగా దాచుకుంటారు.
ఈమధ్యే యేసు ప్రభువు చాలా ప్రేమగా, నేనూ అలాంటి లిస్టును కలిగి ఉన్నానని నా తప్పు నాకు తెలిసేలాగా చేశారు.
అప్పుడు గాని నేను గ్రహించలేదు ఆ వ్యక్తి నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా లిస్టును మరలా మరలా విశ్లేషస్తున్నానని. చాలా క్రమంగా చేదైన వ్యక్తిగా మరలా నేను మారిపోతూ, ఆ చేదైన వేరును నా హృదయంలో మొలిచేలా నేనే అనుమతిస్తున్నాను.
అలాంటి లిస్టును బట్టి నేను పశ్చాత్తాపపడి, సరికొత్త లిస్టును తయారుచేసుకోవడం మొదలుపెట్టాను. ఆ వ్యక్తి గుర్తొచ్చినప్పుడు దేవుని వాక్యంను ఒక లిస్టుగా పెట్టుకోని, వాక్యాన్నే ఉచ్చరించడం ధ్యానించడం కోసం.
ఆ లిస్టులో మొదటిది :
*మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు...జాగ్రత్తగా చూచుకొనుడి. (హెబ్రీయులకు 12:15,16)
నీకు చేదైన లిస్టులు ఏమైనా ఉన్నాయా? వాటిని చించేసేందుకు ఈరోజు దేవుని సహాయం కోరు.. అంతే కాకుండా కొత్త లిస్టును మొదలు పెట్టు.. అందులో ఈ క్రింది వాక్యభాగాలు కూడా ఉండేలా జతచేయి.
✝️కొన్ని తప్పులు చూసి చూడనట్టు వదిలేసి క్షమించడానికి :
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. (సామెతలు 19:11)
నువ్వు గనుక తరుచూ ఇతరులలో లోపాలు వెతుకుతూ ఉంటే బహుశా సమస్య నీలోనే ఉందేమో, ఇతరులలో కాదు. బహుశా నీ దృష్టి ఇతరులలో ఉన్న సుగుణాలపై కేంద్రీకరిస్తే, నీ కంటిలో దూలన్ని ఉంచుకోకుండా జాగ్రత్తపడొచ్చు :
మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి. (ఫిలిప్పీయులకు 4:8)
"...నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?" (మత్తయి 7:1-5)
✝️కొన్ని తప్పులకు రాజీ కుదుర్చుకోవాలి :
మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. (మత్తయి 18:15)
✝️అన్ని తప్పులు నిజాయితీగా క్షమించాలి :
ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. (కొలొస్సయులకు 3:13)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.