నిగ్రహమే లేని ఈ లోకంలో ఆశా-నిగ్రహం కలిగి ఉండటం


ఆశా-నిగ్రహం మన విశ్వాశానికి ఎప్పుడూ కీలమైనది. ఈరోజు వాక్యధ్యానం దీని గురించే మనకు కొంత జ్ఞానాన్నిస్తుంది.


ఆశా-నిగ్రహం అనేది ప్రతీ విశ్వాసి జీవితానికి అత్యంత కీలకమైనది, అందుకే 2 పేతురు 1:5-8 లో విశ్వాసానికి దీనిని అమర్చుకోవడానికి చాలా జాగ్రత్తపడమని వ్రాయబడింది.


ఆశా-నిగ్రహం అనేది అవసరానికి ఆశపడటానికి మధ్య తేడాను గుర్తించేలా మనకు సహాయం చేస్తుంది (ఫిలిప్పీయులకు 4:11-13). అది ఇతర వ్యక్తులతో ఉండే సంబంధాలలో మనం నిస్వార్ధంగా ఉండేందుకూ సహాయం చేస్తుంది (ఫిలిప్పీయులకు 2:3-4). అంతే కాకుండా ముఖ్యంగా దేవుని రాజ్యాన్ని మన దానికంటే పైన పెట్టడానికి సహాయం చేస్తుంది (మత్తయి 6:33).


మనకు ఆశా-నిగ్రహం లేకపోతే మన ఉద్యోగ బాధ్యతలు, ఇంటి పనులు, చదువు, దేవునితో సమయం మొదలైనవి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అతిగా ఖర్చుపెట్టడం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడంలాంటివి చేస్తాము. అలాగే టీవిలో ఇంటర్నెట్ లో చూడకూడనివి చూస్తాము.


కాని క్రీస్తును వెంబడించే వారు దీనికి వ్యత్యాసంగా ఉంటారు. ఎందుకంటే దేవుని కృప భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశాలను విసర్జించాలని, ఈ తరంలో ఆశా-నిగ్రహాన్ని కలిగి, నీతితోనూ భక్తితోనూ బ్రతుకవలెనని వారికి బోధిస్తుంది గనుక. (తీతుకు 2:11-12).


దేవుని శక్తి ద్వారా మనం కూడా ఈ ఆశా-నిగ్రహాన్ని కలిగి ఒక మంచి ఉద్యోగిగా, మంచి తల్లిగా/దండ్రిగా, మంచి భార్యగా/భర్తగా, మంచి పొరుగువారిగా ఉండగలం.


నీ జీవితంలో ఏ విషయాల్లో అయినా ఈ ఆశా-నిగ్రహంలో లోపం కలిగి ఉన్నావా? దేవుని సహాయం కోరి, ఈ క్రింది వచనాలను ధ్యానించు :


• ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును. (2 పేతురు 1:5-8)



• దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు. (2 తిమోతికి 1:7)



• అయితే ఆత్మఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు. (గలతీయులకు 5:22,23)



• ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే. (సామెతలు 25:28)


Self-Control in an Out-of-Control World



ఆశా-నిగ్రహం మన విశ్వాశానికి ఎప్పుడూ కీలమైనది. ఈరోజు వాక్యధ్యానం దీని గురించే మనకు కొంత జ్ఞానాన్నిస్తుంది.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.