ద్రాక్షావల్లిని హత్తుకొనుట

యేసు మన ద్రాక్షావల్లి అని యోహాను 15 చెప్తుంటే, ఆ ద్రాక్షావల్లికి ఎలా చురుకుగా లోబడి ఒక ఫలభరితమైన, ఆరోగ్యకరమైన విశ్వాసిగా మారాలో ఫిలిప్పీయులకు 2 వివరిస్తుంది.


తీగలు ఎలాగైతే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే ఫలిస్తాయో, మనం కూడా అలా ఆయనలో నిలిచియుండాలని యేసు యోహాను 15 లో చెప్పడం చూస్తాం.


దీని అర్ధం ఏమిటంటే యేసు మనలో చేసే పనికి మనం చురుకుగా సమర్పించుకోవాలి.


ఫిలిప్పీయులకు 2:12-13 దీనినే ఈ విధంగా వివరిస్తుంది : "....భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే."


మన పని నిజంగా సులువైనదే అయినా, దానిని మనం తీవ్రంగా తీసుకోవాలి (భయముతోను వణకుతోను). మనం అలా ఉంటే తప్ప దేవుడు మనలో చేసే పనిని మనం అనుమతించలేము. కాని దేవుని పని చాలా కష్టమైనది... అది మనలో నిజమైన శాశ్వతమైన మార్పును తీసుకొస్తుంది.


మన పని = ప్రార్ధన, వాక్యధ్యానం, పరిశుద్దుల సహవాసం, దైవిక ప్రభావాలు, దేవుని ఆజ్ఞలకు లోబడటం ద్వారా ద్రాక్షావల్లితో అంటుకట్టబడి ఉండటం.


దేవుని పని = మనలో వృద్ధిని కలిగించుట, ఆత్మీయ సౌందర్యంలో బలంలో వికసించేలా చేయుట, మన జీవితాలు మంచి పనులతో, ఆత్మీయ ఫలాలతో ఫలభరితం  చేయుట.


నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుకు చురుకుగా లోబడే మన పనిని మనం తీవ్రంగా తీసుకునే తీర్మానం ఈరోజు చేసుకుందామా!


Embracing Our Vine


యేసు మన ద్రాక్షావల్లి అని యోహాను 15 చెప్తుంటే, ఆ ద్రాక్షావల్లికి ఎలా చురుకుగా లోబడి ఒక ఫలభరితమైన, ఆరోగ్యకరమైన విశ్వాసిగా మారాలో ఫిలిప్పీయులకు 2 వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.