యేసులో ఆనందించుట

మనలో చాలామందికి దేవుని వాగ్దానాల గురించి అయోమయంగా ఉంటుంది. ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం ఆనందించడం గురించి కూడా మనకు ఒక స్పష్టతను తీసుకొస్తుంది.


ఆనందించడానికి, యేసులో ఉన్న వాగ్దానాలకు ఉన్న సంబంధం ఏమిటి అని నాకు ఒకోసారి అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది.


మెర్రీయం వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం "ఆనందించడం" గురించి ఎన్నో నిర్వచనాలు ఇవ్వబడ్డాయి.. ఎక్కువ ఆదరణ పొందిన ఒక నిర్వచనం ఏమిటంటే "అది ఒక ఆహ్లాదకరమైన, సంతృప్తికరమైన అనుభవమని".


మానవులు సాధారణంగా తమ ఆనందాన్ని వారికి ఏవి ముఖ్యమైనవని వారు అనుకుంటారో వాటిపై ఆధారం చేసుకుంటారు. ఉదాహరణకు : వివాహం, పిల్లలు, గొప్ప పేరు, ఆరోగ్యం, అధికారం, కామము, ఆనందించడం, విరామం తీసుకోవడం, పగ తీర్చుకోవడం లేక ఇంకా ఇలా అనేక రకాలు.


డిక్షనరీలో  చెప్పబడిన ఈ నిర్వచనాన్ని కాదు యేసు క్రీస్తు వాగ్దానం చేసింది. ఎందుకంటే అది చాలా బలహీనమైనది, తాత్కాలికమైనది.. పరిస్థితులపై ఆధారపడేది కనుక. క్రీస్తు పై మనకు నమ్మకం ఉంటే, ఆయన ఇచ్చే వాగ్దానం ఈ డిక్షనరీ నిర్వచనం కంటే ఎంతో గొప్పది .. అది ఎల్లపుడూ సంతృప్తికరమైన ఆనందకరమైన స్థితిలో మనలను ఉంచుతుంది (యోహాను 14:27; యోహాను 16:33; ఫిలిప్పీయులకు 4:4-7; 1 తిమోతి 6:6).


*యేసులో ఉండే ఆనందం, ఆయనలో మన స్థానం ఏమిటో దానిపై ఆధారపడి ఉంటుంది, ఆ ఆనందం కృతఙ్ఞతలో నుండి పుడుతుంది.. కాబట్టి యేసులో ఉండే ఆనందం పరిస్థితులపై ఆధారపడేది కాదు (1 థెస్సలోనీకయులకు 5:18).


సమస్యలు కష్టాలు వచ్చినపుడు, మన దృష్టి వాటిపై నుండి త్రిప్పుకోవాలి :
కేవలం వాటిని వదిలించుకోవాలి అని అనుకోవడం బదులు, యేసును విశ్వాసంలో బలపరచమని, ఆయనకు ఘనత తెచ్చే విధంగా పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో సహాయం చేయమని అడగాలి (యాకోబు 1:2-3).


ప్రియమైన విశ్వాసి, నువ్వు నిజంగా ఆనందంగా ఉన్నావా? ఈ క్రింది వచనాలను జాగ్రత్తగా ధ్యానించి, యేసులో ఆనందిచడం మొదలుపెట్టు!


• శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. (యోహాను 14:27)


• నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. (యోహాను 16:33)


• ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకలజనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. (ఫిలిప్పీయులకు 4:4-7)


• సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది. (1 తిమోతి 6:6)


• ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. (1 థెస్సలొనీకయులకు 5:18)


• నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. (యాకోబు 1:2,3)


Happiness in Jesus


మనలో చాలామందికి దేవుని వాగ్దానాల గురించి అయోమయంగా ఉంటుంది. ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం ఆనందించడం గురించి కూడా మనకు ఒక స్పష్టతను తీసుకొస్తుంది.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.