పరిమిత జ్ఞానమా అపరిమిత జ్ఞానమా? జీవితాన్ని నిర్ణయించే ఎంపిక.

ప్రతీరోజూ నీవు చేసే నిర్ణయాల గురించి నీ అవగాహన ఏంటి? విశ్వాసానికి, వెలిచూపుకి, పరిమిత, అపరిమిత జ్ఞానానికి మధ్య తేడా నీకు అర్ధమవుతుందా?


• క్రైస్తవులమైన మనం విశ్వాసులం గనుక, చూడని వాటిని, అర్ధం కాని వాటిని నమ్ముతాం:


విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది (హెబ్రీయులకు 11:1)


• మనం విశ్వాసులం గనుక, మన సృష్టికర్తను నమ్ముతాం:


ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము (హెబ్రీయులకు 11:3)


• మనం విశ్వాసులం గనుక, మన పరిమిత జ్ఞానాన్ని నమ్ముకోము. దేవుని అపరిమితమైన జ్ఞానాన్ని నమ్ముకుంటాం:


ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి (యెషయ 55:9).


మనకంటే దేవుడు ఎంతో ఉన్నతుడు, అనంత జ్ఞాని, అంతే కాకుండా ఏ దోషం లేనివాడు, ప్రేమ, దయ, క్షమ, మహిమలు కలిగినవాడు. అలాంటి దేవుణ్ణి సేవించే ధన్యత క్రైస్తవులమైన మనకున్నందుకు , మనం నిజంగా ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి (కీర్తనలు 103). సరైనది కాని మానవ ఆలోచనలకు, జ్ఞానానికి పరిమితమై ఉండాల్సిన అవసరం కూడా మనకు లేనందుకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి.


• మనం విశ్వాసులం గనుక, మన జ్ఞానానికి మించిన శాంతిని మనం పొందగలం:


అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. (ఫిలిప్పీయులకు 4:7)


మనిషి చేసిన దేవుళ్ళు, తత్వజ్ఞానాలతో అదే పనిగా రోజూ మనపై దాడి జరుగుతున్నప్పటికీ, దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే "ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే (1 కొరింథీయులకు 3:19).


నేనైతే దేవుని అపరిమితమైన జ్ఞానన్నే నమ్ముకుంటాను. మరి నీవు?


Finite Wisdom or Infinite Wisdom? The Choice That Determines Your Life.


ప్రతీరోజూ నీవు చేసే నిర్ణయాల గురించి నీ అవగాహన ఏంటి? విశ్వాసానికి, వెలిచూపుకి, పరిమిత, అపరిమిత జ్ఞానానికి మధ్య తేడా నీకు అర్ధమవుతుందా?


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.