ఏశావు చేసిన ఒక మంచి పని

పాపపు జీవనశైలి కలిగిన వ్యక్తిగా ఏశావు ప్రసిద్ధి చెందినప్పటికీ, అతను మంచి పని ఒకటి చేసాడు. అదేమిటో తెలుసుకోవాలంటే, ఈరోజు వాక్యధ్యాన్నాన్ని చదవాల్సిందే 💜


ఏశావు మొదట్లో ఎంతో దారుణంగా పడిపోయినప్పటికీ, తరువాత చాలా దైవికమైన పని ఒకటి చేసాడు.


యాకోబు తన సొంత ప్రాంతాన్ని విడిచి వెళ్లే సమయానికి, యాకోబు గాని ఏశావు గాని దైవికమైన యవ్వనస్తులు కారు. వాస్తవంగా యాకోబే ఏశావుతో తనకున్న సంబంధాన్ని నాశనం చేసుకోవడానికి ప్రధాన కారణం.. ఎందుకంటే యాకోబే ఏశావును శోధించి మోసంచేసి, అతని జ్యేష్టత్వపు హక్కును, ఆశీర్వాదాలను తీసేసుకున్నాడు. (1)


యాకోబు ఏశావును ద్వేషించడానికి ఉన్న కారణాలకంటే ఏశావు యాకోబును ద్వేషించడానికే ఎక్కువ కారణాలు ఉన్నాయి.


కాని యాకోబు ఎవ్వరికీ చెప్పకుండా తిరిగి తన సొంత ప్రాంతానికి వస్తున్నపుడు, ఆదికాండము 33:4 లో ఏమని వ్రాయబడిందంటే :


"అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి."


యాకోబు ఏశావుకు కొంత బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నించినపుడు,"...ఏశావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను. (ఆదికాండము 33:9)


ఒక సంతృప్తిని క్షమాపణను కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ ఏశావును చూస్తాం (2), యాకోబుతో ఉన్న సంబంధం తిరిగి కట్టుకోవాలన్నదే ఏశావు కోరిక.


నీకున్న సంబంధాలలో నీవు కూడా ఇలా చేయాల్సిన అవసరత ఉందా? మనం పరిశీలించుకుందామా!


--------------------------


(1) దేవుడు యాకోబుకు ఆశీర్వాదాన్ని వాగ్దానం చేసాడు, కాని యాకోబు అతని తల్లి పరిస్థితులను తమ సొంత చేతుల్లోనికి తీసుకోని, దేవుడు ఇవ్వక ముందే, వారే ఆ ఆశీర్వాదాలను 'దొంగలించే' ప్రయత్నం చేశారు.


(2) ఏశావు జీవితంలో ఈ సన్నివేశం తప్ప ఎక్కడా అతను దైవికంగా కనపడడు.. కాని ఈ సన్నివేశం ఎంతో ముఖ్యమైనది. సమాధానపడటం అనేది ఇద్దరి వైపు సమ్మతి ఉంటేనే సాధ్యపడుతుంది, ఏదైనా సంబంధం విరిగితే ఇరువైపుల వారు తమ హృదయాలను చాలా శ్రద్దగా పరిశీలించుకోవాలి.

బైబిల్ హబ్ కామెంటరీ నుండి :

"ఈ సన్నివేశంలో ఏశావు యొక్క ప్రవర్తన చూస్తే మంచి స్వభావం, క్షమించే గుణం కనబడుతుంది. యాకోబుకు కీడు కలిగించే ఉద్దేశం అతనిలో ఎక్కడా కనబడదు. 400 మందితో అతను వెళ్లడం అన్నది అనుకోకుండా జరిగింది గాని యాకోబు మీద కోపాన్ని చూపించే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే ఆ సన్నివేశమంతటిలో ఎంతో  ఉదారంతో, సాధువుగా తాను ప్రవర్తించాడు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.