కొన్నిసార్లు హృదయాన్ని చూడటం మనం మర్చిపోతాం

దావీదు గొలియాతును జయించే సమయంలో దావీదు పెద్దన్న ఎలా ప్రవర్తించాడో నీకు తెలుసా? ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


దేవుడు మనిషి బాహ్య రూపాన్ని కాని, లోకంలో అతనికున్న గొప్ప స్థాయిని కాని చూడడు. దేవుడు హృదయాన్ని చూసేవాడు...


కాబోయే రాజును అభిషేకించడానికి సమూయేలు వచ్చాడు. ఎత్తుగా, అందంగా ఉన్న పెద్ద అన్న ఏలియాబే ఆ కాబోయే రాజు అయి ఉండొచ్చు అని సమూయేలు అనుకున్నాడు. కాని దేవుడన్నాడు :


"అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును." (1 సమూయేలు 16:7)


ఎవ్వరూ గుర్తించని, ఒక గొర్రెల కాపరి, అందరికంటే చిన్నవాడు అయిన దావీదును అభిషేకించమని దేవుడు సమూయేలుతో చెప్పాడు.


ఒక అధ్యాయం తరువాత :

ఒక గొర్రెల కాపరైన దావీదు, దేవుడు తప్పకుండ గొలియాతుపై విజయాన్నిస్తాడని ఇజ్రాయెల్ సైన్యాన్ని ప్రోత్సాహించడం మాత్రమే కాదు, దేవుని నామాన్ని ఘనపరచడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు.❤


ఎంతో ఎత్తు అందం ఉన్న ఏలియాబు మాత్రం దావీదు చుట్టూ తిరుగుతూ గాయపరిచే మాటలంటూ ఉన్నాడు (1 సమూయేలు 17:28).


దావీదు, ఏలీయాబు హృదయాలకు ❤ ఎంత వ్యత్యాసం ఉందో కదా!


ప్రియ ప్రభువా, బాహ్య రూపం, గొప్ప స్థాయి, ధనం, ప్రాముఖ్యతలను మించి, నీవు చూసినట్టే నేను కూడా హృదయాలను చూసేలాగ సహాయం చేయి! ❤


Sometimes We Miss Seeing the Heart


దావీదు గొలియాతును జయించే సమయంలో దావీదు పెద్దన్న ఎలా ప్రవర్తించాడో నీకు తెలుసా? ఒక్క నిమిషంలో చదువగలిగిన ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.